Pawan Kalyan: ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ రానా కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా భీమ్లా నాయక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. సినిమాలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘భీమ్లా నాయక్’గా కనిపించనున్నాడు. ఇక రానా డేనియల్ శేఖర్ పాత్రలో నటించాడు. ఈ ఇద్దరి ఇగో చుట్టూ తిరిగే స్టోరీ. నువ్వానేనా అన్నట్టుగా ఇద్దరి మధ్య స్టోరీ నడుస్తూ ఉంటుంది. అందులో ఉంటే సినిమాకి స్క్రీన్ ప్లే మరియు డైలాగులు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించడంతో… సినిమా పై మరింత ఇంట్రస్ట్ చూపిస్తున్నారు సినీ ప్రేమికులు.
వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అదే సమయంలో దగ్గర దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన “RRR” విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో ‘భీమ్లా నాయక్’ సినిమా వాయిదా వేశారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ నిరాశ చెందారు. తీరా చూస్తే అదేసమయంలో కరోనా కేసులు పెరగటంతో RRR కూడా విడుదల కాని పరిస్థితి. అయితే ఆ సమయంలో శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరిలో పవన్ సినిమా వస్తుందని ఇండస్ట్రీలో టాక్ వచ్చింది.
ఇదిలా ఉంటే తాజాగా ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ మొదటి తారీకు ‘భీమ్లా నాయక్’ విడుదల అవుతుందని సినిమా యూనిట్ ప్రకటించడంతో పవన్ ఫ్యాన్స్ పిచ్చ కోపంగా ఉన్నారు. క్లారిటీ లేకుండా రెండు తేదీలు ప్రకటించడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఇప్పటికే ఓ అరగంట పవన్ కళ్యాణ్ పార్ట్ తగ్గించినట్లు కూడా వార్తలు రావడంపై అభిమానులు ఫుల్ సీరియస్ అవుతున్నారు. విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వాలని సినిమా యూనిట్ నీ సోషల్ మీడియా సాక్షిగా నిలదీస్తున్నారు.