NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Rakul Preet Singh: జాకీకి అది చాలా ఎక్కువ.. అందుకే పెళ్లి చేసుకున్నా.. భ‌ర్త‌పై ర‌కుల్ ఓపెన్ కామెంట్స్‌!

Rakul Preet Singh: ప్ర‌ముఖ క్రేజీ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇటీవ‌ల‌ ఓ ఇంటిది అయిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ న‌టుడు, నిర్మాత జాకీ భ‌గ్నానీతో ర‌కుల్ ఏడ‌డుగులు వేసింది. ఫిబ్ర‌వ‌రి 21న గోవాలోని ఒక‌ రిసార్ట్‌లో గ్రాండ్ గా వీరి వెడ్డింగ్ జ‌రిగింది. ఆనంద్ కరాజ్, సింధీ అనే రెండు సాంప్ర‌దాయాల‌ను పాటిస్తూ వీరు పెళ్లి చేసుకున్నారు. ర‌కుల్ ప్రీత్ సింగ్‌-జాకీ భ‌గ్నానీ వివాహానికి కుటుంబ‌స‌భ్యులు, బంధుమిత్రులే కాకుండా బాలీవుడ్ నుండి పెద్ద ఎత్తున స్టార్స్ హాజరయ్యారు.

ఇప్ప‌టికే వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే తాజాగా భ‌ర్త జాకీపై ర‌కుల్ ఆస‌క్తిక‌ర వ్య‌ఖ్య‌లు చేసింది. అత‌నితో త‌న‌కు ఇష్ట‌మైన క్వాలిటీ ఏంటో రివీల్ చేసింది. ఇటీవ‌ల‌ అస్సాంలో ఓ కార్యక్రమానికి ర‌కుల్ త‌న భర్తతో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా జరిగిన ఓ సరదా సంభాషణలో తనకు సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఎక్కువని జాకీ భ‌గ్నానీ చెప్ప‌గా.. ప‌క్క‌న ఉన్న ర‌కుల్ వెంట‌నే రియాక్ట్ అయింది.

అవును, జాకీ సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్ చాలా ఎక్కువ‌. తను నవ్వుతూ.. పక్క ఉన్న వారందర్నీ నవ్విస్తాడు. అందర్నీ హ్యాపీగా ఉండేలా చూడటం అతని ప్రత్యేకత. ఆ క్వాలిటీ న‌చ్చే అత‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. జాకీ అద్భుతమైన హాస్య చతురత కలిగిన వ్యక్తి.. అంతకు మించి మంచి మనసున్న వ్యక్తి అంటూ భ‌ర్త గురించి ర‌కుల్ ప్రీత్ ఎంతో గొప్ప‌గా చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు ఆమె కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

కాగా, 2019 వ‌ర‌కు తెలుగు, త‌మిళ భాష‌ల్లో బిజీ హీరోయిన్ గా స‌త్తా చాటిన ర‌కుల్‌.. ఆ త‌ర్వాత బాలీవుడ్ పై ఫోక‌స్ పెట్టింది. అక్క‌డ సినిమా ఛాన్సులు ద‌క్కించుకుంటూ స్టార్ హోదాను అందుకోవాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తోంది. ఒక్క 2022లోనే నార్త్ లో రకుల్ న‌టించిన అర‌డ‌జ‌న్ చిత్రాలు విడుదల అయ్యాయంటే.. బాలీవుడ్‌పై ఆమె ఫోక‌స్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఇటీవ‌ల తమిళంలో అయాల‌న్ మూవీతో హిట్ అందుకున్న ర‌కుల్‌.. ప్ర‌స్తుతం ఇండియ‌న్ 2, మేరీ పట్నీ కా రీమేక్ తో స‌హా ప‌లు చిత్రాలు చేస్తోంది. తెలుగులో మాత్రం ఈ బ్యూటీ ఒక మూవీ కూడా లేక‌పోవ‌డం గ‌మ‌న్నార్హం.

author avatar
kavya N

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju