Cinema సినిమా

Bollywood: బాలీవుడ్లో ఖాన్స్ సినిమాల రిలీజు… వీరైనా బి టౌన్ గతి మార్చగలుగుతారా?

Share

Bollywood: గత కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్ సినిమా గతి ఏమి బాగోలేదు. కరోనా కాలం సంగతి పక్కన పెడితే, అంతకు ముందు ఇంచుమించు 6, 7 సంవత్సరాల ముందు నుండి అక్కడ సరియైన సినిమా వచ్చిన పాపాన లేదు. పెద్ద పెద్ద హీరోల సినిమాల విడుదలైనా వసూళ్లు అంతంత మాత్రమే. సరిగ్గా 2015లో మన సౌత్ నుండి రిలీజైన ‘బాహుబలి 1’ సినిమా నార్త్ లో రికార్డు వసూళ్లను సాధించి బాలీవుడ్ గుండెల్లో గుబులు పుట్టించింది. అక్కడినుండి మన సినిమాల అక్కడ సత్తా చాటుతున్నాయి. తరువాత 2017లో రిలీజైన ‘బాహుబలి 2’ సినిమా అయితే బి టౌన్ లో ఏకంగా 500 కోట్లు పైనే కలెక్ట్ చేసి రికార్డు సెట్ చేసి పారేసింది.

Bollywood:  గతి తప్పిన బాలీవుడ్ గమనం:

ఈ సినిమాతో మన తెలుగోడి సత్తా దశదిశలా వ్యాపించింది. దాంతో అక్కడి పెద్ద హీరోలు అంటూ చలామణి అవుతున్న హీరోలు కాస్త నెమ్మదించారు. ఇదే క్రమంలో వారి బయోపిక్ లను తీయడం స్టార్ చేసారు. ఈ క్రమంలో కొన్ని బయోపిక్ లు సక్సెస్ అయినా మరికొన్ని ఫెయిలవుతున్నాయి. ముఖ్యంగా మనదగ్గర తెరకెక్కిన తెలుగు సినిమా మహానటి ఎంతటి ఘన విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇటీవల రిలీజైన పుష్ప, RRR, KGF సినిమాల విజయవిహారంలో బాలీవుడ్ ఆల్మోస్ట్ కొట్టుకుపోయిందనే చెప్పుకొని తీరాలి.

ఖాన్స్ సినిమాల సంగతి?

ఇలాంటి తరుణంలో ఖాన్స్ సినిమాల త్వరలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ సినిమాల విడుదలకు క్యూ కడుతున్నాయి. టైగర్ -3 తో సల్మాన్ ఖాన్, పఠాన్ సినిమాతో షారుక్, లాల్ సింగ్ చద్దాతో అమీర్ ఖాన్ దండయాత్రకు రాబోతున్నారు. అయితే సౌత్ సినిమాల ప్రభావం మెండుగా వున్న వేళ ఈ సినిమాల ప్రభావం ఏ తీరుగా ఉంటుందో అని కొంతమంది విశ్లేషిస్తున్నారు. సౌత్ సినిమాలకు ధీటుగానే ఈ సినిమాల వుండబోతున్నాయనేది బాలీవుడ్ సమాచారం. ఇక సౌత్ సినిమాల రుచి మరిగిన నార్త్ ప్రేక్షకులని ఈ సినిమాల ఎంతగా ఆకట్టుకుంటయో వేచి చూడాల్సి ఉంది.


Share

Related posts

Review : రివ్యూ – ‘చావు కబురు చల్లగా’ ఫస్ట్ హాఫ్

siddhu

Alitho Saradaga : ఆలీతో సరదాగా షోలో డైరెక్టర్ అనీల్ రావిపూడి, శ్రీవిష్ణు సందడి

Varun G

Rashmika mandanna: వామ్మో.. ర‌ష్మిక ఇంత ప‌ని చేసిందేంటి..ఇక కుర్రాళ్ళు ఆగుతారా?

kavya N