తెలుగు బుల్లితెరపై యాంకర్లలో అందంలోనూ, ఆకట్టుకోవడంలోనూ శ్రీముఖికి ప్రత్యేకత ఉంది. యాంకర్‌గానే కాకుండా సినిమాల ద్వారా కూడా ఆమె పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా బిగ్ బాస్-3లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న తర్వాత ఆమె క్రేజ్ అమాంతంగా పెరిగింది. బిగ్‌బాస్‌లో ఫైనల్ వరకు వెళ్లి రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత తన పాత వృత్తి అయిన యాంకరింగ్‌లో ఆమె బిజీ అయిపోయింది. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా కనిపించిన ఆమె, క్రేజీ అంకుల్స్ అంటూ వచ్చిన సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇలా యాంకరింగ్ కొనసాగిస్తూనే, అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తోంది. ఈ తరుణంలో ఇటీవల ఆమె చేసిన ఫొటో షూట్లలో అందాలు ఆరబోస్తోంది. ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మహిళా యాంకర్లు అంటేనే గ్లామరస్ డ్రెస్‌లు వేసుకుంటుంటారు. అందరికీ అందంగా కనిపించేందుకు తహతహలాడుతుంటారు. ఈ తరుణంలో వారు ఫొటో షూట్లు చేయడం కొత్త కాదు. సినిమా హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందం యాంకర్లకు ఉంటుంది. అయితే తాజాగా యాంకర్ శ్రీముఖి చేసిన ఫొటో షూట్ బాగా వైరల్ అవుతోంది. అందులో ఆమె వేసుకున్న నీలి రంగు డ్రెస్ బాగుంది. అయితే పైన టాప్ మాత్రం హుక్కులు, గుండీలు ఏమీ పెట్టకుండా అలాగే వదిలేసింది. ఆ ఫొటోలు కుర్రకారును రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఏ మాత్రం గాలికి ఆ హుక్కులు ఊడిపోతే పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
అవకాశాల కోసం కొందరు ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లు ఇలా ఫొటో షూట్లు చేయడం కామన్. అయితే అన్ని అవకాశాలు బాగుండి కూడా శ్రీముఖి ఇలా చేస్తుందేమిటో అని నెటిజన్లు బుర్ర గోక్కుంటున్నారు. ఈ ఫొటోలను జాగ్రత్తగా పరిశీలిస్తే, అందులో శ్రీముఖి ఇంతకు ముందులా కాకుండా కాస్త సన్నబడినట్లు అర్ధం అవుతోంది.