Ajith kumar: ఆ అమ్మాయి లేక‌పోతే బ‌త‌క‌లేను..ఆమెనే పెళ్లి చేసుకుంటానంటున్న‌ స్టార్ హీరో!

Share

Ajith kumar: ప్ర‌ముఖ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సికింద్రాబాద్‌లో పుట్టి పెరిగిన‌ప్ప‌టికీ.. అజిత్ త‌మిళ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును తెచ్చుకున్నాడు. చ‌దివింది ప‌దో త‌ర‌గ‌తే అయినా అనేక భాష‌ల‌ను అనర్గళంగా మాట్లాగ‌ల అజిత్‌.. 1993లో ‘అమరావతి’ అనే సినిమా ద్వారా తొలిసారి తెర‌పై క‌నిపించాడు. ఈ చిత్రం త‌ర్వాత అడ‌పా త‌డ‌పా అవ‌కాశాలు అందుకున్న‌ అజిత్ 1995లో `ఆసాయ్` అనే మూవీతో ఫ‌స్ట్ హిట్ కొట్టాడు. ఈ చిత్రం త‌ర్వాత అజిత్ వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. వ‌రుస సినిమాలు చేస్తూ త‌న‌దైన న‌ట‌న‌తో కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్నాడు. మ‌రోవైపు రేసింగ్‌లోనూ తన ప్రతిభ చూపిస్తూ అంద‌రి చేత ప్ర‌శంస‌లు అందుకున్నాడు.

star hero ajith kumar love story with heroine swathi
star hero ajith kumar love story with heroine swathi

రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో ఫాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అజిత్ ఒక‌డు. అయితే ఎంత ఎదిగినా ఒదిగే ఉండ‌టం ఈయ‌న నైజం. అందుకే అజిత్‌ను కొంద‌రు మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ అని కూడా పిలుస్తుంటారు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. గ‌తంలో అజిత్ ఓ తెలుగు హీరోయిన్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయాడు. ఇంత‌కీ ఆమె ఎవ‌రో కాదు స్వాతి. హైద‌రాబాద్‌లో జ‌న్మించిన స్వాతి `దేవా` సినిమాతో కోలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. మొద‌టి చిత్రంతోనే ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ త‌ర్వాత ఈమె అజిత్‌తో `వాన్మతి` అనే చిత్రంలో న‌టింది. అప్పుడు మొద‌లైన వీరి పరిచ‌యం ప్రేమ‌కు దారి తీసింది.

star hero ajith kumar love story with heroine swathi
star hero ajith kumar love story with heroine swathi

ఈ నేప‌థ్యంలోనే అజిత్‌, స్వాతిలు రోజూ క‌లుసుకుంటూ బైక్ మీద చెన్నై వీధుల్లో షికార్లు కొట్టేవార‌ట‌. వీకెండ్ వ‌చ్చిందంటే పార్టీలు చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసేవార‌ట‌. అంతే కాదు, స్వాతినే పెళ్లి చేసుకుంటా, ఆమె లేక‌పోతే బ‌త‌క‌లేను అన్న స్థాయికి అజిత్ వెళ్లిపోయాడ‌ట‌. కానీ, వీరిద్ద‌రి ప్రేమ‌, పెళ్లికు స్వాతి అమ్మగారు ఒప్పుకోలేదట‌. అమ్మ మాట కాద‌న‌లేక స్వాతి సైతం అజిత్‌కి బ్రేక‌ప్ చెప్పేసి వ‌రుస సినిమాల‌తో బిజీ అయిపోయింద‌ట‌. దాంతో కొద్ది రోజులు డిప్రెష‌న్‌లోకి వెళ్లిన అజిత్‌.. మ‌ళ్లీ సినీ కెరీర్‌పై ఫోక‌స్ పెట్టి అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హోదాను ద‌క్కించుకున్నాడు. ఇక ఈయ‌న 2000 సంవత్సరంలో నటి షాలినిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు సంతానం.


Share

Related posts

Aacharya Movie : ఇండస్ట్రీలో మరో రికార్డు సృష్టించిన మెగాస్టార్ “ఆచార్య”..??

sekhar

Ram Charan : వైష్ణవ్ తేజ్ కి యాక్టింగ్ వెనుక పవన్ బాబాయ్…అంటూ చరణ్ షాకింగ్ కామెంట్స్..!!

sekhar

హనీమూన్‌కు వెళ్లి భర్తను అరెస్ట్ చేయించిన పూనమ్ పాండే.. కారణమేంటంటే?

Teja