NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Guinness Record Movie: కేవ‌లం 24 గంట‌ల్లో షూటింగ్ పూర్తి చేసుకుని గిన్నిస్ బుక్ ఎక్కిన సినిమా ఏదో తెలుసా.. తెలుగులో కూడా విడుద‌లైంది!

Guinness Record Movie: ప్రస్తుత రోజుల్లో ఒక సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేయాలంటే మినిమమ్ ఆరు నెలలు సమయం పడుతుంది. అదే పెద్ద హీరోల సినిమాలైతే కనీసం ఏడాది నుంచి రెండేళ్లు షూటింగ్ కోసమే కేటాయిస్తున్నారు. కానీ మన ఇండియన్ ఫిలిం హిస్టరీలో కేవలం ఒక్క రోజులో షూటింగ్ కంప్లీట్ చేసుకుని గిన్నిస్ బుక్ ఎక్కిన సినిమా ఒకటి ఉందని తెలుసా..? అవును మీరు విన్నది నిజమే. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు సుయంవరం. దాదాపు రెండున్న‌ర ద‌శాబ్దాల క్రింద‌ట త‌మిళంలో వ‌చ్చిన కామెడీ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఈ చిత్రానికి చాలా ప్ర‌త్యేక‌తులు ఉన్నాయి.

ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 14 మంది హీరోలు మ‌రియు 12 మంది హీరోయిన్లు ఈ చిత్రంలో న‌టించారు. విజయకుమార్‌, మంజుల విజయకుమార్, స‌త్య‌రాజ్‌, ప్ర‌భు, అబ్బాస్‌, రోజా, రంగ‌, క‌స్తూరి, మహేశ్వరి, ప్రీతా విజయకుమార్, ఖుష్బు, ప్రభుదేవా, హీరా, కార్తీక్, వినీత్‌, అర్జున్ స‌ర్జాతో స‌హా త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని న‌టీన‌టులు సుయంవ‌రంలో భాగం అయ్యారు. అలాగే జె. పనీర్, ఏఆర్ రమేష్, కీయార్, ఇ. రాందాస్, అర్జున్, గురు ధనపాల్, లియాఖత్ అలీ ఖాన్, ఆర్‌ సుందరరాజన్, సెల్వ, కె సుబాష్, సుందర్ సి, సిరాజ్, కెఎస్ రవికుమార్, పి వాసు మొత్తం 14 మంది ద‌ర్శ‌కులు ఈ సినిమాను రూపొందించారు.

గిరిధారిలాల్ నాగ్‌పాల్ సుయంవ‌రం సినిమాకు క‌థ అందించ‌డ‌మే కాకుండా నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు. 1999లో గిరిధారిలాల్ నాగ్‌పాల్ ఈ ప్రాజెక్ట్ ను త‌న పద్నాలుగేళ్ల కల అని పేర్కొంటూ అనౌన్స్ చేశారు. అలాగే 24 గంటల్లో ఈ సినిమాను చిత్రీకరిస్తామ‌ని ప్రకటించారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మానికి సూప‌ర్ స్టార్ రజనీకాంత్ మరియు కమల్ హాసన్ హాజరు అయ్యారు.

1999 ఏప్రిల్ 5 మరియు 6 తేదీలలో చెన్నైలోని ఫిల్మ్ స్టూడియోలో చెప్పిన‌ట్లుగానే 23 గంటల 58 నిమిషాల్లో సుయంవ‌రం చిత్రీకరణ పూర్తి చేశారు. ప‌క్కా ప్లానింగ్ తో మొత్తం స్క్రిప్ట్ ను 11 పార్ట్‌లుగా డివైడ్ చేసి ఒక్కో ఆర్టిస్ట్ సీన్ల‌ను ఒక్కో డైరెక్ట‌ర్ వేర్వేరు ప్లేస్‌ల‌లో సేమ్ టైమ్‌లో షూట్ చేశారు. సుయంవ‌రం చిత్రం కోసం నాగ్‌పాల్‌తో పాటు 19 మంది అసోసియేట్ డైరెక్టర్లు, 45 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు, 19 మంది కెమెరామెన్లు, 36 మంది అసిస్టెంట్ కెమెరామెన్లు, తొమ్మిది మంది స్టెడిక్యామ్ ఆపరేటర్లు, 14 మంది హీరోలు, 12 మంది హీరోయిన్లు, విలన్లు, కమెడియన్లు, ఐదుగురు డ్యాన్స్ మాస్టర్లు, 16 మంది అసిస్టెంట్లు, 140 మంది కోరస్ డ్యాన్సర్లు, స్టంట్ కోఆర్డినేటర్లు ప‌ని చేశారు.

1999 జూలై 16న విడుద‌లైన సుయంవ‌రం చిత్రం మంచి విజ‌యాన్ని అందుకుంది. ముఖ్యంగా మేకింగ్ ప‌రంగా ఎన్నో ప్ర‌శంస‌లు అందుకుంది. అత్యధిక తారలను ఎంపిక చేసినందుకు మరియు అత్యంత త‌క్కువ స‌మ‌యంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్నందుకు గానూ సుయంవరం మూవీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఇక సుయంవ‌రం సినిమాను పెళ్ళంటే ఇదేరా టైటిల్ తో డ‌బ్ చేసి తెలుగులో విడుద‌ల చేశారు. తెలుగులో సైతం ఈ చిత్రానికి మంచి ఆధ‌ర‌ణ ల‌భించింది.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N