NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Syed Sohel: సోహైల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక‌ముందు డ‌బ్బు కోసం నిజంగా అలాంటి ప‌నులు చేశాడా..?

Syed Sohel: సయ్యద్ సోహెల్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ లో బుల్లితెరతో పాటు వెండితెర ప్రేక్షకులకు కూడా సోహెల్ సుప్రసిద్ధుడే. ప్రస్తుతం ఇతను హీరోగా ఎదిగేందుకు ఎంతగానో కష్టపడుతున్నాడు. గ‌త ఏడాది ఆర్గానిక్ గా మామ హైబ్రీడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన సోహెల్.. ఇటీవల బూట్ కట్ బాలరాజు మూవీ తో వచ్చాడు. శ్రీ కొన్నేటి డైరెక్ట్ చేసిన‌ ఈ చిత్రంలో సోహెల్ హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా సైతం వ్యవహరించాడు.

ఫిబ్రవరి 2న విడుదలైన బూట్ కట్ బాలరాజు పరాజయం పాలయింది. ఆ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. సోహెల్ నటుడిగా ముఖ పరిచయమే తప్ప అతని పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. ఈ నేపథ్యంలోనే సోహెల్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? సినిమాలోకి రాకముందు అతడు ఏం పని చేసేవాడు..? వంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1991 ఏప్రిల్ 18న తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్‌లో స‌య్య‌ద్ సోహెల్ జ‌న్మించాడు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ అయిన సోహెల్ కు చిన్నతనం నుంచి సినిమాలు అంటే విపరీతమైన ఆసక్తి. ఆ ఆసక్తితోనే చదువు అనంతరం ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు. ఎటువంటి సినీ నేపథ్యం లేకపోవడం వల్ల సోహెల్ కు అంత త్వరగా అవకాశాలు రాలేదు. దాంతో డబ్బుల కోసం క్యాటరింగ్ వర్క్ చేశాడు. వెడ్డింగ్ ఈవెంట్స్ లో క్యూ మెంబర్ గా పని చేశాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ లో న‌టించారు. ఆ సమయంలోనే కొత్త బంగారు లోకం చిత్రంలో అవ‌కాశం వ‌చ్చింది. ఇదే సోహెల్ ఫ‌స్ట్ ఫిల్మ్‌. 2008లో విడుద‌లైన ఈ చిత్రంలో హీరో క్లాస్మేట్ గా సోహెల్‌ నటించాడు.

ఆ త‌ర్వాత‌ కెమెరామెన్ గంగతో రాంబాబు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అంతకుముందు ఆ తర్వాత, ఢీ ఫర్ దోపిడి, జనతా గ్యారేజ్ తదితర చిత్రాల్లో గుర్తింపు లేని పాత్రల్లో నటించాడు. అలాగే మరోవైపు సీరియల్స్‌ ద్వారా టెలివిజ‌న్ రంగంపై అడుగు పెట్టాడు. పసుపు కుంకుమ, నాటిచరామి, కృష్ణవేణి వంటి సీరియస్ ద్వారా బుల్లితెరపై క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజ‌న్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. త‌న‌దైన ఆట‌తీరు, ప్ర‌వ‌ర్త‌త‌తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ షో తర్వాత సోహెల్ కు హీరోగా అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయి. అలా యురేక, లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు.. ఇలా హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఎలాగైనా హీరోగా నిలదొక్కుకోవాలని తాపత్రయపడుతున్నాడు.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N