Cinema సినిమా

Samantha: సమంత vs నాగచైతన్య అభిమానుల మధ్య వార్ డిబేట్?

Share

Samantha: సమంత – నాగచైతన్య ఒకప్పుడు అందమైన జంటగా పేరుపొందిన పెయిర్. నేడు విడాకులు తీసుకొని ఎవరి దిక్కు వారు అన్న మాదిరి జీవిస్తున్న ఒంటరి పక్షులు. ‘ఏమాయ చేసావే’ సినిమాలో మంచి ప్రేమికులుగా నటించిన వీరు నిజ జీవితంలో కూడా మంచి ప్రేమికులుగా చలామణి అవుతూ, కడకు పెళ్లితో ఒక్కటయ్యారు. తరువాత అనూహ్య కారణాలవలన విడిపోయారు. వారు విడిపోయి నెలలు గడుస్తున్నా జనాలు మాత్రం ఆ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా సో కాల్డ్ అభిమానులు మాత్రం ఒకింత మానసిక కుంగుబాటుకి లోనయ్యారని అర్ధం అవుతోంది.

కారణం ఇదే మరి!

ఈ క్రమంలో సమంత vs నాగచైతన్య అంటూ మరో రకం ప్రచారం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. సామ్ నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం ‘యశోద’ ఆగస్టు 12న విడుదల కాబోతుంది. ఇక సరిగ్గా ఆ డేట్ కి ఒక రోజు ముందు అంటే ఆగస్టు 11న నాగచైతన్య నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ విడుదలవుతోంది. అమీర్ ఖాన్ – నాగచైతన్య ప్రధానపాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవ్వబోతోంది. దాంతో సో కాల్డ్ ఫాన్స్ సోషల్ మీడియాలో తెగ కొట్టేసుకుంటున్నారు. మా సినిమా ఆడుతుందంటే, మా సినిమానే ఆడుతుందంటూ ఓ రకమైన సంభాషణలు చేసుకుంటున్నారు.

ఈ సవాల్ లో గెలుపెవరిదో?

ఇకపోతే, భారీ రిలీజ్ కి సిద్ధమవుతున్న లాల్ సింగ్ చద్దాతో యశోద పోటీపడుతుండడం యాధృచ్ఛికమే అయినప్పటికీ అభిమానులు మాత్రం దాన్ని పర్సనల్ గా తీసుకుంటున్నట్టు భోగట్టా. అదంతా ఒకెత్తయితే, ఇక ఇదే సమయంలో అఖిల్ నటించిన ఏజెంట్ ని రిలీజ్ చేస్తుండడం ఇక్కడ మరో గమ్మత్తనే చెప్పుకోవాలి. ఏజెంట్ ను ఆగష్టు 11 న విడుదల చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే చై వర్సెస్ సామ్ వర్సెస్ అఖిల్ వార్ కూడా మొదలవ్వక తప్పదన్నమాట.


Share

Related posts

ర‌కుల్ కొత్త ప్ర‌య‌త్నం

Siva Prasad

KGF -2 release date : కేజిఎఫ్ -2 వచ్చేస్తోంది గురూ..

bharani jella

RGV: హీరో సుమంత్ రెండో పెళ్లి పై రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar