Samantha Naga Chaitanya: ప్రముఖ ఆంగ్ల వార్త పత్రిక మ్యాగజైన్ ఇండియా టుడే నాగచైతన్య వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆర్టికల్ రాయటం జరిగింది. చైతు రెండో పెళ్లి ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో జరగబోతున్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని ఈ కథనంలో ఉంది. ఇక ఇదే సమయంలో హీరోయిన్ శోభిత ధూళిపాళతో నాగచైతన్య బంధం రోజురోజుకీ బలపడుతూ ఉందని స్పష్టం చేయడం జరిగింది. అంతే కాదు త్వరలో ఈ ఇద్దరు కలిసి పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్లు ఈ ఆర్టికల్ లో రాసుకోచ్చారు.

ఇదంతా పక్కన పెడితే 2017లో హీరోయిన్ సమంతనీ నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకోవటం తెలిసిందే. అయితే పెళ్లి చేసుకున్న నాలుగు సంవత్సరాలకే 2021లో ఇద్దరు మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోవడం జరిగింది. అనంతరం కెరియర్ పరంగా ఎవరికి వారు సినిమాలు చేసుకుంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో నాగచైతన్య మరో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా రావడం జరిగింది.

అంత మాత్రమే కాదు విదేశాలలో వీరిద్దరూ తిరుగుతున్న ఫోటోలు రెస్టారెంట్లలో దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. కానీ సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతూ సినిమాలు చేసుకుంటూ ఉంది. గత ఏడాది మయోసైటీస్ వ్యాధిన బారిన పడటంతో.. సమంత చాలా అనారోగ్యానికి గురైంది. దాదాపు ఆరు నెలల పాటు సినిమాలు కూడా మానేయడం జరిగింది.

అనంతరం ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసిన సమంత… ప్రజెంట్ పూర్తిగా రికవరీ కావడానికి అమెరికాలో స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే విడాకులు తీసుకున్న తర్వాత చైతన్య ఫోటోలు ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి తొలగించగా మళ్లీ ఇటీవల ఆర్చివ్ లో నుండి రి పోస్ట్ చేయడం జరిగింది.

ఈ క్రమంలో సమంత నాగచైతన్య మళ్ళీ కలుస్తున్నట్లు అందరు భావించారు. అయితే ఇంతలోనే శోభిత ధూళిపాళతో.. నాగచైతన్య పెళ్లికి రెడీ అవుతున్నట్లు ఇండియా టుడే లో ఆర్టికల్ రావడం సమంతా కి కచ్చితంగా షాక్ ఇచ్చినట్లే అని వార్త పై నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.