NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

Telugu Movie: ఫారెన్ కంట్రీస్ లో షూటింగ్ అనేది ప్రస్తుత రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. మీడియం రేంజ్ హీరోల చిత్రాలు సైతం యూఎస్, యూకే మరియు ఇతర కంట్రీస్ లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. తెలుగు సినిమాలు కూడా ఇందుకు ఏమాత్రం మినహాయింపు కాదు. మ‌నోళ్లు ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి షూటింగ్ చేస్తున్నారు. కానీ నాలుగు దశాబ్దాల కిందట పరిస్థితి ఇలా లేదు. ఫారెన్ కంట్రీస్ లో షూటింగ్ చేయడం అంటే పెద్ద సాహసమే. పైగా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అటువంటి కాలంలో అగ్రరాజ్యంగా పిలవబడే అమెరికాలో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏదో తెలుసా.. `హరే కృష్ణ హలో రాధా`.

ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించారు. ఆయనకు జోడిగా శ్రీప్రియ, రతి అగ్నిహోత్రి యాక్ట్ చేశారు. సి.వి.శ్రీధర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని శ్రీ భరణీ చిత్ర ఎంటర్‌ప్రైజెస్ బ్యాన‌ర్ పై బి.భరణీరెడ్డి నిర్మించారు. సత్తార్, ప్రకాష్, ఆనంద్ మోహన్, వి.సత్యనారాయణ, పండరీబాయి, శ్రీలక్ష్మి, కైకాల సత్యనారాయణ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. 1980 అక్టోబర్ 16వ తేదీన విడుదలైన హరే కృష్ణ హలో రాధా మంచి విజ‌యాన్ని అందుకుంది.

అయితే ఈ చిత్రంలో కొన్ని స‌న్నివేశాలు, ఒక సాంగ్ మిన‌హా దాదాపు 75 శాతం షూటింగ్ ను అమెరికాలోనే చేశారు. అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న మొట్ట మొద‌టి తెలుగు చిత్రం కృష్ణ గారిదే కావ‌డం విశేషం. అలాగే తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రూపొందించారు. తెలుగులో కృష్ణ హీరోగా చేస్తే.. త‌మిళ వెర్ష‌న్ లో శివ చంద్ర‌న్ న‌టించారు. రెండు భాష‌ల్లోనూ హీరోయిన్లుగా శ్రీప్రియ, రతి అగ్నిహోత్రిలే చేశారు.

ఇక‌పోతే షూటింగ్ అంటే వంద మందికి పైగా పని చేస్తుంటారు కానీ అమెరికాలో షూటింగ్ పెట్టుకోవడం వల్ల హరే కృష్ణ హలో రాధా సినిమా కోసం చాలా కొద్ది మందిని మాత్రమే ఫారెన్ కు తీసుకెళ్లారు. అలాగే ఇప్పుడు అంటే అమెరికాలో ఎక్కువ మంది తెలుగు వారే ఉన్నారు. కానీ అప్పటి రోజుల్లో అక్కడ తెలుగువారు అస్సలు కనిపించేవారు కాదు. అమెరికన్స్ మధ్యనే ఈ సినిమాను చిత్రీకరించారు. ఇక మరొక విషయం ఏమిటంటే.. హరే కృష్ణ హలో రాధా మూవీలో విజయనిర్మల గారు నటించకపోయినప్పటికీ.. కృష్ణ గారితో ఆమె కూడా అమెరికా వెళ్లారు. వంటల్లో స్పెషలిస్ట్ ఆయన విజయ నిర్మ‌ల‌ గారు.. తను బస చేసిన చోటే ప్రతిరోజూ పలు రకాల ఫుడ్ ఐటమ్స్ ను స్వ‌యంగా వండి షూటింగ్ సెట్ కు తీసుకెళ్లేవారు. అందరికీ భోజనం వడ్డించేవారు. అందువల్ల అమెరికాలో ఉన్నన్ని రోజులు ఫుడ్ విషయంలో యూనిట్ ఎటువంటి ఇబ్బంది పడకుండా హ్యాపీగా షూటింగ్ పూర్తి చేశారు.

Related posts

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Chandrababu: ఆ అధికారులను కలిసేందుకు చంద్రబాబు విముఖత ..

sharma somaraju

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri