NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Narasimha Movie: నరసింహ మూవీలో నీలాంబరి పాత్ర‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Narasimha Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో నరసింహ(త‌మిళంలో పడయప్ప) ఒకటి. కె.ఎస్‌. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అలనాటి తార సౌందర్య హీరోయిన్ గా నటిస్తే.. రమ్యకృష్ణ లేడీ విలన్ గా అలరించింది. అలాగే లక్ష్మి, సితార, రాజా రవీంద్ర, నాజర్‌, అబ్బాస్, ప్రీతా విజయకుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

1999లో తమిళ్, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం సంచ‌ల‌న‌ విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ వ‌సూళ్ల‌ను సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మరో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే జపాన్ లో కూడా ఈ సినిమాకు అద్భుత ఆదరణ లభించింది. ఇకపోతే నరసింహ‌ సినిమాలో రజనీకాంత్ తర్వాత రమ్యకృష్ణ బాగా హైలెట్ అయ్యింది. ఇందులో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రను ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. అప్పటివరకు స్టార్ హీరోయిన్ గా గ్లామర్ పాత్రల్లో అలరించిన ఆమె.. నరసింహ సినిమా ద్వారా న‌టిగా త‌న‌లోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.

లేడీ విలన్ గా ఆమె కనబరిచిన నటన సినీ ప్రియుల‌తో పాటు విమర్శకుల‌ను సైతం మెప్పించింది. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. నీలాంబరి క్యారెక్టర్ కు ఫస్ట్ ఛాయిస్ రమ్యకృష్ణ కాదు. ప్రముఖ స్టార్ హీరోయిన్ ను మొదట నీలాంబరి క్యారెక్టర్ కోసం సంప్రదించారు. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు మీనా. రజినీకాంత్, మీనా జంటగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. వెండితెర‌పై వీరిద్దరిది హిట్ కాంబినేషన్. అయితే నరసింహ మూవీ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న నీలాంబ‌రి పాత్ర‌ను చేయమని డైరెక్టర్ కే.ఎస్‌. రవికుమార్ మీనా ను సంప్రదించారట.

ఆ సమయంలో మీనా హోమ్లీ పాత్రలు చేస్తూ స‌త్తా చాటుతోంది. అలాంటి త‌రుణంలో నెగటివ్ రోల్ చేయవద్దని మీనాకు ఆమె తల్లి సూచించారట. దాంతో అమ్మ మాట మేరకు న‌ర‌సింహ మూవీని రిజెక్ట్ చేశారు. ఆ త‌ర్వాత మీనా చాలా బాధపడ్డారు. ఎందుకంటే నీలాంబరి క్యారెక్టర్ మీనాకు ఎంతో బాగా నచ్చింది. అయితే తల్లి అడ్డు చెప్పడంతో ఆమె అయిష్టంగానే నో చెప్పారు. ఇక అప్పుడు డైరెక్ట‌ర్ ర‌వికుమార్ రమ్యకృష్ణను ఆ పాత్రకు ఎంపిక చేశారు. అలా నీలాంబరి క్యారెక్టర్ మీనా చేతుల నుంచి చేజారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని మీనా స్వయంగా బయట పెట్టారు.

author avatar
kavya N

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju