sports న్యూస్ బిగ్ స్టోరీ

ఎం ఆట… ఎం ఆట.. సూపరో సూపర్… టీమ్ ఇండియా!!

Share

 

 

టీమిండియా కుర్రాళ్లు అదరగొట్టేసారు. చరిత్ర సృష్టించారు. నిజంగానే అద్భుతం చేశారు. ఏమాత్రం నమ్మకం లేకుండా పెద్ద అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా ఆస్ట్రేలియా వంటి అతిపెద్ద క్రికెట్ జట్టును వారి సొంత గడ్డ మీదే ఓడించి అద్భుతమైన చరిత్రను తిరగరాసింది. టి20 కాలంలో టెస్టులకు పెద్ద ఇమేజ్ లేని కాలంలో టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శనతో మరోసారి టెస్ట్ క్రికెట్ లో భారత జట్టు యాత్ర మంచి మైలురాయి తో మొదలైందని చెప్పవచ్చు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. మూడు వికెట్లు ఉండగానే విజయానికి కావాల్సిన పరుగులు 328 పరుగులను సాధించింది. దీంతో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత్ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాలో మ్యాచ్ లాడుతూ ఇన్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫి ఇండియా సాధించడం ఇదే మొదటిసారి. నాలుగో టెస్టులో అసాధ్యమనుకున్న టార్గెట్ ను సైతం, కొత్త కుర్రాళ్ళు సమిష్టి కృషితో అద్భుతంగా రాణించి కప్పు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అంతా కొత్త కుర్రాళ్ళే ఆడిన టెస్ట్ క్రికెట్ లో అద్భుతమైన విజయాన్ని సాధించడం భవిష్యత్తు టీమిండియా ఆశలను మరింత సజీవంగా ఉండేలా చేసింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లను ధాటిగా ఎదుర్కోవడంలో భారత బ్యాట్స్మెన్ అంతా సమిష్టిగా రాణించారు. ముఖ్యంగా మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ల ప్రతిభను ముఖ్యంగా చెప్పుకోవాలి.

బౌలింగ్ లోను!!

ఆస్ట్రేలియా పిచ్ లు వేగంగా ఉంటాయి. ఆ పిచ్ లకు అలవాటు పడడం అంత తేలికైన పని కాదు. అయితే ఏమాత్రం అంచనాలు లేని బౌలర్లు ఈ సిరీస్లో అద్భుతంగా రాణించారు. భారత టాప్ ఆటగాళ్లందరూ గాయాల బారినపడి స్వదేశానికి వచ్చేసిన ఏమాత్రం అంచనాలు లేకుండా అప్పటికప్పుడు టీమ్ లో చోటు సంపాదించిన కొత్త కుర్రాడు మాత్రం ఎంతో కసితో ఆడి ట్రోఫీని గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. నటరాజన్, సిరాజ్, శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ లాంటి చిన్న బౌలర్లు ఆస్ట్రేలియా కు చుక్కలు చూపించారు. ముఖ్యంగా ప్రతి అడుగులోనూ ప్రతి రన్ లోను ఇండియా గెలవాలన్న కసి కనిపించింది. ఎక్కడా తగ్గకుండా గట్టిగా అడిగితే విజయం సాధ్యమవుతుంది అన్న విషయాన్ని ఈ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లు సాకారం చేశాయి.

నాలుగో టెస్ట్ లో…

నాలుగో టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో వెనుకబడిన భారత్ ఆస్ట్రేలియాకు 33 రన్స్ ఆధిక్యత ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఆస్ట్రేలియా ను కట్టడి చేసి 294 రన్స్ కు ఆ లవ్ చేసింది. దీంతో మొత్తంగా 328 టార్గెట్ ను భారత్కు ఆస్ట్రేలియా నిర్దేశించింది. నాలుగో టెస్టు జరుగుతున్న మెల్బోర్న్ లోని గబ్బా వంటి మైదానంలో ఇప్పటివరకు 250 రన్స్ దాటి టార్గెట్ ను జయించిన జట్టు లేదు. అయితే ఇప్పుడు టీమిండియా 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం తో మెల్బోర్న్ స్టేడియంలో కొత్త చరిత్ర రాసినట్లు అయింది.

పంత్… గిల్… పూజరా!!

నాలుగో టెస్టు విజయంలో లక్ష్యాన్ని సాధించడంలో ముఖ్యంగా భారత బ్యాట్స్మెన్ ముగ్గురు గురించి చెప్పుకోవాలి. టాప్ ఆర్డర్ లో వచ్చిన కొత్త కుర్రాడు శుభ మన్ గిల్ ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. 91 రన్స్ వ్యక్తిగత స్కోరు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎంతో నెమ్మదిగా ఆడి సీనియర్గ తన సత్తా చాటిన పూజరా సైతం 211 బాల్స్ ఆడి 56 రన్స్ చేసాడు. ఇక చివర్లో కీపర్ పంత్ తన విశ్వరూపాన్ని చూపింది ఇండియా కు చిరస్మరణీయ విజయం అందించాడు. 138 బాల్స్ ఆడి 89 రన్స్ సాధించి… అవుతుందనుకున్న మ్యాచ్ ను పూర్తిగా భారత్ వైపు తిప్పాడు. అసలు ఏమాత్రం విజయం మీద నమ్మకం లేని టీమిండియాకు ఈ విజయం అద్భుతమే. అలాగే ఎప్పటికీ ఇండియా చరిత్రలో ఈ ట్రోఫీ చిరకాలం గుర్తుండి పోతుంది.


Share

Related posts

డీజీపీ సవాంగ్ ద్వారా ఏపీ ప్రజలందరికీ పెద్ద హింట్ ఇచ్చిన జగన్ ?

Srikanth A

బిజెపి నేతను హత్య చేసిన ఉగ్రవాదులు

somaraju sharma

Tragedy: ఓ మహిళ భర్త, పిల్లలను వదిలివేసి వెళ్లిపోయింది..! ఆ తరువాత ఆ ఇంట్లో తీవ్ర విషాదం..! ఏమి జరిగిందంటే..?

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar