ప్ర‌భాస్ కు చేదు అనుభ‌వం.. ఆవిరైపోయిన అభిమానుల ఆశ!

Share

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస భారీ ప్రాజెక్ట్స్‌తో ఎంత బిజీగా ఉన్నారో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్పాల్సిన అవ‌సరం లేదు. అయితే ఈయ‌న చివ‌రిగా `రాధేశ్యామ్‌` చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది.

భాగ్యశ్రీ, జగప‌తి బాబు, కృష్ణం రాజు తదితరులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. గోపీ కృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌, టి.సిరీస్ బ్యాన‌ర్ల‌పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు క‌లిసి పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఇట‌లీ బ్యాక్‌డ్రాప్‌లో వింటేజ్ ప్రేమ క‌థగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చ్ 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో అంచ‌నాల న‌డుమ విడుద‌లైంది.

కానీ, ఆ అంచ‌నాల‌ను ఈ సినిమా ఏ మాత్రం అందుకోలేక‌పోయింది. భారీ విజువ‌ల్స్ త‌ప్పా సినిమాలో ఏం లేద‌ని సాధార‌ణ ప్రేక్ష‌కులే పెద‌వి విరిచారు. థియేట‌ర్స్‌లో రిలీజ్ అయిన కొద్ది రోజుల‌కే ఓటీటీలోకి రాగా.. అక్క‌డా ఈ చిత్రం యావ‌రేజ్ అనిపించుకుంది. అయితే తాజాగా బుల్లితెర‌పై సైతం ప్ర‌భాస్ కు చేదు అనుభ‌వ‌మే ఎదురైంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేశారు.

దీనికోసం జీ సంస్థ ప్రమోషన్స్ కూడా చేసింది. దీంతో బుట్టితెర‌పై రాధేశ్యామ్ ఖ‌చ్చితంగా రికార్డు స్థాయిలో టీఆర్పీ సంపాదిస్తుంద‌ని అభిమానులు ఆశ ప‌డ్డారు. దాదాపు 15 నుండి 20 టీఆర్పీ వ‌స్తుంద‌ని భావించారు. కానీ, అది జ‌ర‌గ‌లేదు. వారి ఆశ ఆవిరైపోయింది. ఈ మూవీకి కేవలం 8.25 టీఆర్ఫీ మాత్రమే వచ్చింది. ఇది చాలా అంటే చాలా తక్కువ. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ప్ర‌భాస్ సినిమాకు ఇంత త‌క్కువ టీఆర్పీ రావ‌డం అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

1 గంట ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago