ఆకర్షించే అందం, పర్సనాలిటీ కాదు టాలెంట్ ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అని నిరూపించిన హీరోల్లో కోలీవుడ్ స్టార్ ధనుష్ ఒకరు. తమిళ చిత్రాలతో సినీ కెరీర్ ప్రారంచిన ఈయన.. అంచలంచలుగా ఎదుగుతూ గ్లోబర్ స్టార్‌గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం నార్త్, సౌత్ లోనే కాదు హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు.
అటువంటి ఆయనకు ఘోర అవమానం జరిగింది. ఆటో డ్రైవర్లా ఉన్నాడు, వీడు హీరో ఏంటి..? అంటూ కొందరు ముఖం మీదే కామెంట్లు చేశారట. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదు.. ధనుష్ కెరీర్ ఆరంభంలో జరిగిందట. ఈ విషయాన్ని రీసెంట్గా ధనుష్ స్వయంగా బయట పెట్టాడు. కెరీర్ స్టార్టింగ్‌లో తన పర్సనాలిటీ కారణంగా హీరో అని చెప్పుకోవడానికే ధనుష్ ఇబ్బంది పడేవాడట.
ఒకసారైతే `కాదల్ కొండేన్` మూవీ సెట్స్ లోకి కొందరు వచ్చి హీరో ఎవరని ధనుష్ నే అడిగారట. దానికి ధనుష్ వేరొకరిని చూపించారట. ఆ తరువాత ధనుష్ హీరో తెలుసుకున్న వారు.. `ఆటో డ్రైవర్లా ఉన్నాడు.. వీడు హీరో ఏంటి..?` అని ముఖం మీదే కామెంట్స్ చేశారట. వారి మాటలకు కృంగిపోయిన ధనుష్ కారెక్కి తెగ ఏడ్చేడట.
ఆ తరువాత తనను తాను ధైర్యం చెప్పుకొని మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నాడట. కట్ చేస్తే `కాదల్ కొండేన్` సినిమా సూపర్ హిట్ అవ్వడంమే కాదు ధనుష్ కి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడేలా చేసింది. కాగా, ధనుష్ ప్రస్తుతం తెలుగులో ఓ డైరెక్ట్ మూవీ చేస్తున్నాడు. అదే `సార్`. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!