`ఉప్పెన` సినిమాతో గ్రాండ్‌గా టాలీవుడ్లోకి అడుగు పెట్టిన అందాల భామ కృతి శెట్టి.. ఆ వెంటనే `శ్యామ్ సింగరాయ్`, `బంగార్రాజు` చిత్రాలతో బ్యాక్ టు బ్యూక్ హిట్లను ఖాతాలో వేసుకుంది. కానీ, ఆ తర్వాత కృతి శెట్టి టైమ్ అస్సలు బాలేదు. ఈమె నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ ఉన్నాయి.
ఇక కృతి శెట్టి అఖరిగా `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇందులో గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బెంచ్‌మార్క్ స్టూడియోస్ బ్యానర్‌పై బి.మహేంద్ర బాబు, కిరణ్ బల్లంపల్లి నిర్మించిన ఈ సినిమాకు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించారు.
ఇందులో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటించారు. సెప్టెంబర్ 16న విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. కృతి శెట్టి పాత్రకు మంచి స్కోప్ ఉన్నా.. కథ, కథనంలో పట్టు లేకపోవడం సినిమాకు పైనస్గా మారింది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కలెక్షన్స్‌ను రాబట్టి.. భారీ నష్టాలను మిగిల్చింది. తాజాగా ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ లెక్కలు బయటకు వచ్చాయి.
నైజాం- 0.30 కోట్లు
సీడెడ్- 0.10 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.15 కోట్లు
ఈస్ట్- 0.06 కోట్లు
వెస్ట్- 0.06 కోట్లు
గుంటూరు- 0.08 కోట్లు
కృష్ణా- 0.07 కోట్లు
నెల్లూరు- 0.06 కోట్లు
——————————-
ఏపీ + తెలంగాణ= 0.88 కోట్లు
——————————-
రెస్ట్ ఆఫ్ ఇండియా- 0.08 కోట్లు
ఓవర్సీస్- 0.22 కోట్లు
—————————
వరల్డ్ వైడ్ కలెక్షన్= 1.18 కోట్లు
—————————
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ.7.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే లాంగ్ రన్లో ఈ సినిమా రూ.1.18 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దీంతో ఈ సినిమా వల్ల బయ్యర్లకు ఏకంగా రూ. 6.82 కోట్ల రేంజ్లో నస్టాలు వచ్చాయని అంటున్నారు.