ఆది పినిశెట్టి.. ఈయన గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ప్రముఖ దర్శకుడు, రచయితైన రవిరాజా పినిశెట్టి కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆది పినిశెట్టి.. కేవలం హీరోగానే కాకుండా విలన్‌గానూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఈయన `ది వారియర్`తో అందరినీ పలకరించాడు.
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తమిళ దర్శకుడు లింగుసామి తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తే.. ఆది పినిశెట్టి విలన్‌గా చేశాడు. జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మంచి స్పందన దక్కించుకుంది. రామ్‌కే కాకుండా విలన్‌గా నటించిన ఆది పినిశెట్టికి కూడా విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి.
ఇకపోతే ఆది పినిశెట్టి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంది? అన్న ప్రశ్న ఎదురవగా.. ఆయన ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. `నాకు అయితే సేమ్ లైఫ్. పెళ్లికి ముందు ఎలా ఉందో.. తర్వాత కూడా అలానే ఉంది.
నిక్కీ, నేను చాలా బావున్నాం. నాకూ, తనకూ మమ్మల్ని అర్థం చేసుకునే తల్లిదండ్రులు ఉన్నారు. అంతా హ్యాపీగా ఉంది.` అంటూ చెప్పుకొచ్చారు. కాగా, ఆది పినిశెట్టి ఇటీవల నటి నిక్కీ గల్రానీని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో 2022 మే 18న కుటుంబసభ్యులు, సన్నిహితుల నడుమ వైభవంగా వీరి వివాహం జరిగింది. వివాహం అనంతరం ఆది పినిశెట్టి నుండి వచ్చిన తొలి చిత్రం `ది వారియర్` కావడం విశేషం.
గోదావరి డేంజర్ బెల్స్ .. దవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక.. సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే