33.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

పెళ్లి వీడియోను పోస్ట్ చేసిన హీరో ఆది పినిశెట్టి.. అదిరిపోయింది అంతే!

Share

ఆది పినిశెట్టి.. తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ఈయ‌న గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దర్శకుడు రచయితైన రవిరాజా పినిశెట్టి కుమారుడుగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టినప్ప‌టికీ.. త‌న‌దైన టాలెంట్‌తో ఆది టాలీవుడ్‌, కోలీవుడ్ భాష‌ల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. హీరోగానే కాకుండా విల‌న్‌, స‌హాయ‌క పాత్ర‌ల‌ను పోషిస్తూ స‌త్తా చాటుతున్నాడు.

ఇటీవ‌లె ఈ యంగ్ హీరో పెళ్లి పీట‌లు కూడా ఎక్కేశాడు. గత రెండేళ్లుగా ప్ర‌ముఖ న‌టి నిక్కీ గల్రానీతో సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఆది పినిశెట్టి.. ఎట్ట‌కేల‌కు ఆమెతో ఏడ‌డుగులు న‌డిచి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. మే 19వ తేదీన చెన్నైలోని ఓ రిసార్ట్‌లో ఆది-నిక్కీల వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.

కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితుల‌తో పాటు ప‌లువురు సెల‌బ్రెటీలు సైతం వీరి పెళ్లితో సంద‌డి చేశారు. ఇందులో సంబంధించిన ఫోటోలు సైతం అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యాయి. అయితే తాజాగా ఆది పినిశెట్టి త‌న ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా తమ పెళ్లి వీడియోను గ్లింప్స్ ను రిలీజ్ చేశాడు.

పెళ్లై మూడు నెల‌లు అవుతోన్నా.. నిన్నే భార్య‌భ‌ర్త‌లు మారిన‌ట్లు అనిపిస్తోంది అని పేర్కొంటూ ఆది ఈ వీడియోను బ‌య‌ట‌కు వ‌దిలాడు. దాంతో ఇప్పుడా వీడియో కాస్త నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఏదేమైన ఆది-నిక్కీల పెళ్లి వీడియో మాత్రం అదిరిపోయింద‌నే చెప్పాలి. మ‌రి లేటెందుకు దానిపై మీరు ఓ లుక్కేసేయండి.


Share

Related posts

SreeMukhi Latest Photos

Gallery Desk

Unstoppable 2: రెండు పార్ట్స్ గా బాలకృష్ణ… ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Samantha: సమంత ప్రాణాంతకర వ్యాధి పోస్టుపై అక్కినేని ఫ్యామిలీ నుండి ఎవరు రియాక్ట్ అయ్యారంటే..!!

sekhar