Anjali: ప్రముఖ హీరోయిన్ అంజలి గురించి పరిచయాలు అవసరం లేదు. తెలుగమ్మాయి అయినప్పటికీ మొదట తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన గుర్తింపు పొందిన అంజలి.. ఆ తర్వాత టాలీవుడ్‌లోకి వచ్చింది. ఇక్కడ షాపింగ్‌మాల్, జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలు అంజలికి సూపర్ క్రేజ్ దక్కేలా చేశాయి.
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో అడపా తడపా సినిమాలు చేస్తున్న అంజలి.. గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం తొలిసారి ఐటెం భామగా మారింది. బన్నీ హీరోగా రూపుదిద్దుకున్న `సరైనోడు` చిత్రంలో `బ్లాక్ బస్టర్` అంటూ అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. అయితే ఇప్పుడు యంగ్ హీరో నితిన్ కోసం అంజలి మళ్లీ ఐటెం సాంగ్ చేసేందుకు సిద్ధమైంది.
నితిన్ హీరోగా ఎమ్‌ఎస్. రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నితిన్‌కు జోడిగా కృతిశెట్టి నటిస్తోంది. కేథరిన్ థ్రెసా కీలక పాత్రను పోషిస్తోంది. పోలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో మాస్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో అంజలి స్పెషల్ సాంగ్ చేయబోతుందట. ఈ మేరకు ఓ అదిరిపోయే పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. అంజలి నటించిన స్పెషల్ సాంగ్ సోమవారం రిలీజ్ కానుంది. మరి ఈ సాంగ్ ఏ రేంజ్‌లో ప్రేక్షకులను అలరించబోతోందో చూడాలి.
నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస ఫ్లాపులను మూడగట్టుకున్నాడు. ఈయన నుండి వచ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…