NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

Mehreen Pirzada: మెహ్రీన్ పిర్జాదా.. ఈ పంజాబీ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు మెహ్రీన్ అత్యంత సుప్రసిద్ధురాలు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మెహ్రీన్.. 2016లో కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో హీరోయిన్ గా తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించింది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా హనురాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తొలి ప్రయత్నం లోనే మెహ్రీన్ తనదైన అందం, అభినయంతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే.. ఇటీవల మెహ్రీన్ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్న సంగతి తెలిసిందే. గర్భధారణను వాయిదా వేయడానికి చాలా మంది హీరోయిన్స్ ఎగ్ ఫ్రీజింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. మెహ్రీన్ కూడా ఈ జాబితాలో చేరింది. పైగా ప్రపంచంలోని మహిళలకు స్ఫూర్తిగా నిలవాలని, వాళ్లలో అవగాహన పెంచాలని తన ఎగ్ ఫ్రీజింగ్ జర్నీని వీడియో రూపంలో మెహ్రీన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.

దీంతో మెహ్రీన్ పై కొంద‌రు త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చురించారు. మెహ్రీన్ ప్రెగ్నెంట్ అయింద‌ని, పెళ్లి కాకుండానే త‌ల్లి కాబోతోంద‌నే వార్త‌లు మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. ఈ వార్త‌ల‌పై మెహ్రీన్ తాజాగా స్పందించింది. త‌ప్పుడు క‌థ‌నాల‌పై ఆమె తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడానికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవసరం లేద‌ని, స్వార్థం కోసం తప్పుడు కథనాలు రాస్తున్న‌వారికి సిగ్గుండాల‌ని మెహ్రీన్ మండిప‌డింది.

ఈ సంద‌ర్భంగా ఎగ్ ఫ్రీజింగ్ గురించి కూడా మెహ్రీన్ వివ‌రించింది. పిల్లలు అప్పుడే వద్దని భావించే క‌పుల్స్ అన్ని విధాలుగా సిద్ధం అయ్యాక పిల్లల్ని కనేందుకు ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ విధానంపై స‌రైన అవ‌గాహ‌న లేకుండా ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. ఇప్పటికైనా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ఆప‌క‌పోతే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అంటూ మెహ్రీన్ స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఆమె పోస్ట్ కాస్త ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

కాగా, కెరీర్ విష‌యానికి వ‌స్తే.. మెహ్రీన్ కు ప్ర‌స్తుతం ఆఫ‌ర్లు అంతంత మాత్రంగానే వ‌స్తున్నాయి. చివ‌ర‌గా ఈ అందాల భామ గత ఏడాది స్పార్క్ అనే మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ సినిమాతో విక్రాంత్ హీరోగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు. అయితే లీలా రెడ్డి భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన స్పార్క్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్టార్ గా నిలిచింది. మెహ్రీన్ ఇప్పుడు క‌న్న‌డ‌లో నీ సిగువరేగు అనే మూవీ చేస్తోంది. తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో మాత్రం మెహ్రీన్ కు పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేదు.

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju