ప్రముఖ నటి పూర్ణ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `సీమ టపాకాయ్`, `అవును`, `అవును 2` తదితర చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అందాల భామ.. ఇటీవల ప్రముఖ వ్యాపార వేత్త షానిద్ ఆసీఫ్ అలీ తనకు కాబోయే భర్త అంటూ పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

ఇక రేపు మాపో ఆమె నుండి పెళ్లి వార్త కూడా వస్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా పూర్ణ ఎవరికీ చెప్పకుండానే గప్‌చుప్‌గా పెళ్లి చేసేసుకుంది. మే 31న పూర్ణ-షానిద్ నిశ్చితార్థం జరగగా.. జూన్ 12న కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల నడుమ అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.

వీరి పెళ్లికి దుబాయ్ వేదికగా నిలిచింది. ఇక పెళ్లి విషయాన్ని పూర్ణ ఆలస్యంగా బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు తాజాగా తన పెళ్లి ఫోటోలు సైతం బయటకు వదిలింది.

ఈ పిక్స్‌లో పూర్ణ దంపతులు ఎంతో అందంగా మెరిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను మరియు అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పూర్ణ పెళ్లి ఫోటోలపై ఓ లుక్కేసేయండి.




