అత‌డితోనే డేట్‌కి వెళ్తానంటున్న రాశి ఖ‌న్నా.. చైతు రిప్లై వైర‌ల్‌!

Share

అందాల తార రాశి ఖ‌న్నా గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఊహలు గుసగుసలాడే`తో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ ముద్దుగుమ్మ‌.. తొలి సినిమాతో ఆక‌ట్టుకునే అందం, అద్భుత‌మైన న‌ట‌న‌తో అంద‌రి మ‌న‌సుల‌తో దోచేసింది. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాల‌ను అందించుకున్న రాశి ఖ‌న్నా.. గ‌త కొంత కాలం నుండీ వ‌రుస ఫ్లాపుతో తీవ్రంగా స‌త‌మ‌తం అవుతుంది.

ఈమె నుండి చివ‌రిగా వ‌చ్చిన శ్రీనివాస కళ్యాణం, ప్రతిరోజూ పండగే, వెంకీ మామ, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలు అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాయి. మొన్నీమ‌ధ్యే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప‌ల‌క‌రించింది. టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, మారుతి కాంబోలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సైతం మిక్స్డ్ రివ్యూలు ద‌క్కించుకుంది.

ఇక‌పోతే త్వ‌ర‌లోనే రాశీ ఖ‌న్నా `థ్యాంక్యూ`తో అల‌రించేందుకు సిద్ధం అవుతోంది. అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా, విక్ర‌మ్ కె కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న యూత్‌ఫుల్ ఎంట‌ర్టైన‌ర్ చిత్ర‌మిది. ఇందులో రాశి ఖ‌న్నాతో పాటు మాళవిక నాయర్, అవికాగోర్‌ హీరోయిన్స్‌గా నటించారు. జూలై 22న ఈ మూవీ రిలీజ్ కాబోతుండ‌గా.. మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా రాశి ఖ‌న్నా చైతుతో క‌లిసి ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంట‌ర్వ్యూలో డేటింగ్ గురించి ప్ర‌స్తావ‌న రాగా.. రాశి ఓ సీక్రెట్‌ను బ‌య‌ట పెట్టింది. తాను హీరోయిన్‌ కాకముందు ఐఏఎస్‌ ఆఫీసర్‌ కావాలని అనుకున్నాన‌ని, స్కూల్‌లో తాను టాపర్‌ అని, బాగా చదువుతానని తెలిపింది. కానీ డేట్‌కి మాత్రం ఓ డాక్టర్‌తో వెళ్లాలనుకుంటున్నట్టు పేర్కొంది. దీంతో నాగచైతన్య వెంట‌నే స్పందిస్తూ.. `డాక్టర్లందరూ ఇది వింటున్నారా? ఇక హాస్ప‌ట‌ల్‌లో వ‌ర్క్ చేయ‌డం మానేసి రాశీ ఇంటి బయట అంద‌రూ వెయిట్‌ చేస్తారు` అంటూ ఫ‌న్నీగా రిప్లై ఇచ్చాడు. దీంతో రాశి సీక్రెట్‌, చైతు రిప్లై రెండు వైర‌ల్‌గా మారాయి.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

13 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

22 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

60 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago