సౌత్ లో సుదీర్ఘకాలం నుంచి స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న ముద్దుగుమ్మల్లో సమంత ఒకరు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఈమె ఏం చేసినా.. ఎక్కడకు వెళ్లినా.. ఏం పోస్ట్ పెట్టినా.. క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ఆమె విడాకులే. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ జంట ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయింది. పెళ్లై నాలుగేళ్లు గడవకు ముందే విడాకులు తీసుకుని ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఇక సమంత విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయింది. నిత్యం ఏదో ఒక పోస్ట్ వార్తల్లో నిలుస్తోంది.
తాజాగా కూడా తాను ధరించిన బ్లాక్ టీ షర్ట్‌పై ఉన్న కోట్ కనిపించేలా ఓ ఫోటో షేర్ చేసింది సమంత. ఆ టీషర్ట్‌పై `యు విల్ నెవెర్ వాక్ అలోన్` అని రాసుంది. దానర్థం నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయలేవు అని. ఇంకేముంది ఈ ఒక్క పోస్ట్‌తో సమంత మళ్ళీ ప్రేమలో పడిందంటూ ప్రచారం మొదలైంది.
తాను పెట్టిన పోస్ట్ కు అదే అర్థం అంటూ నెట్టింట కొత్త చర్చ మొదలైంది. మరి నిజంగానే సమంత మళ్ళీ ప్రేమలో పడిందా..? ఆమె పోస్ట్ కు అర్థం అదేనా..? అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా, సమంత ప్రస్తుతం `శాకుంతలం`, `యశోద`, `ఖుషి` వంటి పాన్ ఇండియా చిత్రాలు చేస్తోంది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ సైతం సమంత చేతిలో ఉన్నాయి.
https://www.instagram.com/p/CjjsMzPL03F/?utm_source=ig_web_copy_link