Sameera Sherief: సమీరా షరీఫ్,బుల్లితెర నటులలో ఈమెకి ప్రత్యేకమైన స్థానం ఉంది.ఈమె తెలియని వారంటూ ఎవరు ఉండరు. 2006 సంవత్సరంలో ఆడపిల్ల అన్న సీరియల్ తో బుల్లితెర నటిగా కెరియర్ మొదలు పెట్టింది సమీరా, ఇక ఆ తర్వాత వరుస సీరియల్స్ తో, బుల్లితెరిని షేక్ చేసింది అని చెప్పుకోవాలి. ఆ తర్వాత వచ్చిన అభిషేకం, మూడుముళ్ల బంధం, ప్రతిబింబం, భార్యామణి ,మంగమ్మ గారి మనవరాలు, ఇలా చాలా సీరియల్స్ లో తెలుగులో నటించి, మంచి ప్రేక్షక ఆదరణ చొరగున్న నటి.ఈమె 1991 నవంబర్లో జన్మించింది.

ఈమె పుట్టి పెరిగిందంతా హైదరాబాదు తెలంగాణలోనే, ఈమె తండ్రి అమీర్ షరీఫ్ బిజినెస్ మాన్, ఈమె చిన్నతనంలోనే సీరియస్ లో నటించాలి అన్న కోరికతో బుల్లితెరకు పరిచయమయి, తెలుగు తమిళ సీరియల్స్ చేసింది. నాగబాబు తో కలిసి అదిరింది అనే షో లో యాంకర్ గా కూడా చేసింది సమీరా, 2019లో లవ్ మ్యారేజ్ చేసుకుంది సమీరా, ఈమె భర్త అన్వర్ తమిళ నటుడు నిర్మాత కూడా, చాలా సీరియల్స్ కి నిర్మాతగాని సినిమాలకు నిర్మాతగాను అన్వర్ తమిళంలో సుపరిచితుడు.

అన్వర్ తల్లి సనా కూడా సీరియల్స్ లో నటిస్తారు.ఈమె చాలా సీరియస్ లో సినిమాలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అందరికీ పరిచయం, సనా పరిచయంతోనే సమీరా అన్వర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అన్వర్ సమీరాలు సుమారు నాలుగు సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత సమీరా నటనకు కాస్త బ్రేక్ చెప్పింది. ఆ తర్వాత ఒకటి రెండు షోలలో కనిపించిన పిల్లలు పుట్టిన తర్వాత పూర్తిగా నటనకు దూరమైందనే చెప్పాలి. కానీ ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అత్తతో కలిసి వీడియోలు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటూనే ఉంది సమీరా, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సమీరా, తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఒక వీడియోని పోస్ట్ చేసింది.

అయితే ఆ వీడియోలో ఆమె పెదవి నుండి రక్తం కారుతూ ఉండగా, ఆమె ఆ పెదవిని చూపిస్తూ తన పోస్టులో ఇలా రాస్కొచ్చింది. ” ప్రతి కథకు ఒక్కొక్కరికి అభిప్రాయం ఉంటుంది ఇది నాది అంటూ మొదలుపెట్టి, ఇది ఒక మెమరీ, దీని నేను పోస్ట్ చేస్తాను అని అనుకోలేదు. కానీ దీని గురించి మీరేమనుకుంటున్నారో తెలుసుకోవాలి అని ఉంది. మీరు ఈ ఫోటో చూసినప్పుడు, నేను మా ఇంట్లో వాళ్లతో ఫ్రెండ్స్ తోనో ఫ్యామిలీ మెంబర్స్ తోనో లేదంటే నా భర్తతోనో గొడవ పడినట్లు కనిపిస్తుంది. కానీ నేను మా వారితో గొడవ పడలేదు. అలాగని అసలు గొడవ పడకుండా ఉండలేదు. కానీ ఇప్పుడు ఈ గాయం మాత్రం, అర్హన్ వల్ల జరిగింది.అర్హాన్ నా మేనల్లుడు. ఇది వాడి వల్లే జరిగింది. నేను నా భర్తను చాలా ప్రేమిస్తాను.

కానీ ఇలాంటి గాయాలు చూసినప్పుడు మీలో ఎవరో కొంతమంది అయినా నేను నా భర్తతో గొడవపడ్డాను అని అనుకుంటారు కానీ మీరు మీ వైపు నుంచి ఆలోచించేదేనిని, జడ్జిమెంట్ చేయవాకండి అని చెప్తూ ఆమె పోస్ట్ చేసింది. కానీ చిన్న గాయానికి ఇంత పోస్ట్ పెట్టాలా అని నెట్టిజనులు కొంతమంది అనుకుంటున్నారు. ఆమె ఫ్యాన్స్ అయితే ఏదో జరిగి ఉంటుంది అనుకుంటున్నారు. ఏది ఏమైనా సమీరా పెట్టిన పోస్ట్ ఇప్పుడు, అందరిలో చర్చనీయాంసంగా మారింది. ఆ పోస్ట్ ని మీరు ఒకసారి చూసేయండి.
View this post on Instagram