పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం `ఆదిపురుష్`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్రమిది. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. అలాగే సన్నీ సింగ్, దేవదత్తా నాగే తదితరులు కీలక పాత్రలను పోషించారు.
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే విడుదలకు మూడు నెలలే సమయం ఉండటంతో ప్రచార కార్యక్రమాలను షురూ చేసిన మేకర్స్.. నేడు అయోధ్యలో `ఆదిపురుష్` టీజర్‌ను బయటకు వదిలారు.

`భూమి క్రుంగినా.. నింగి చీలినా.. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం` అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ ఆధ్యంతం ఆకట్టుకుంటూ సాగింది. ఈ సినిమాను ఓ విజువల్ వండర్‌గా ఓం రౌత్ తెరకెక్కించారని టీజర్ బట్టీ స్పష్టంగా తేలిపోయింది.
రామసేతుపై సైన్యంతో శ్రీరాముని గెటప్ లో ప్రభాస్ నడిచొచ్చే తీరు, లంకేశ్ గా సైఫ్ అలీఖాన్ రాక్షస గెటప్, సీతగా కృతి సనన్ లుక్ విశేషంగా అలరించాయి. విజువల్స్, బ్యాక్‌గ్రైండ్ మ్యూజిక్ నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. టీజర్‌తో ప్రభాస్ గూస్ బంప్స్ తెప్పించారు. అంచనాలకు అందుకోవడం కాదు.. అంతకు మించి అనేలా టీజర్ ఉంది. మరి ఇంకెందుకు లేటు `ఆదిపురుష్` టీజర్‌పై మీరు ఓ లుక్కేసేయండి.
https://newsorbit.com/cinema/adipurush-prabhas-first-look-viral-in-social-media.html