NewsOrbit
Entertainment News సినిమా

Dhee Show Chaitanya Master: “ఢీ” షో చైతన్య మాస్టర్ సూసైడ్ పై అదిరే అభి సంచలన వ్యాఖ్యలు..!!

Share

Dhee Show Chaitanya Master: ఇటీవల “ఢీ” షో చైతన్య మాస్టర్ సూసైడ్ చేసుకోవటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పుల బాధ తట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులతో.. బలవన్మరణానికి పాల్పడటం.. అందరినీ కలచివేసింది. మల్లెమాల మీడియా వంటి గొప్ప సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న గాని… అప్పుల బాధతో చైతన్య మాస్టర్ మరణించడం పట్ల రకరకాల కామెంట్లు వచ్చాయి. ఈ క్రమంలో జబర్దస్త్ షో కమెడియన్ కం టీం లీడర్ అదిరే అభి.. ఢీ షో చైతన్య మాస్టర్ సూసైడ్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సూసైడ్ చేసుకోక ముందు చైతన్య సెల్ఫీ వీడియోలో జబర్దస్త్ షోకి ఆదాయం ఎక్కువ “ఢీ” షోకి ఆదాయం తక్కువ.. అంటూ చేసిన కామెంట్లపై అదిరే అభి స్పందించారు.

Adire Abhi's Sensational Comments on Dhee Show Chaitanya Master Suicide

ఈ పరిశ్రమలో సక్సెస్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి. బ్రేక్ వచ్చాక నిలబెట్టుకోవాలి. అదేవిధంగా పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. బాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ స్టార్ గా వెలుగొందిన అమితాబ్ కూడా గతంలో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించడం జరిగింది. ఆ బ్యానర్ లో తీసిన సినిమాలన్నీ పరాజయం పాలు కావటంతో వందల కోట్ల మేర నష్టం రావడంతో… కార్లు మొత్తం అమ్మేసుకున్నారు. ఆ తరువాత కౌన్ భనేగా కరోడ్ పతి తో హోస్ట్ గా మళ్లీ కెరియర్ స్టార్ట్ చేసి జీరో నుంచి మళ్లీ సూపర్ స్టార్ గా ఎదిగారు. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో పరిస్థితులను ఎదుర్కొనే మానసిక ధైర్యం ఉండాలి. ఎవరికైనా ఈ ఫీల్డ్ లో ప్లాన్ బి రెడీ చేసుకోవాలి. ఈ క్రమంలో వచ్చే ఆదాయంలో ఎంతో కొంత దాచుకోవాలి. అప్పుడే ఏదైనా కష్టం వస్తే అది మనల్ని ఆదుకుంటుంది. చిన్న చిన్న వాటికి కుంగిపోయే ఆత్మహత్య చేసుకోకూడదు అని అదిరే అభి స్పష్టం చేశారు.

Adire Abhi's Sensational Comments on Dhee Show Chaitanya Master Suicide

జబర్దస్త్ షోకి రేటింగ్ ఎక్కువ కాబట్టి ఎక్కువ… రెమ్యూనరేషన్ ఇస్తారు. వాటిపై ఆధారపడకుండా బయట ఈవెంట్స్ కూడా చేసుకోవాలి. వచ్చే ఆదాయంలో కొంత దాచుకోవాలి అంటూ అదిరే అభి.. తెలియజేయడం జరిగింది. ఇండస్ట్రీపై ఒక అవగాహన తెచ్చుకుంటే.. ఇబ్బందులను ఎదుర్కోవటానికి ఒక మానసిక ధైర్యం వస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చినా వెంటనే ఎవరు ఎర్ర తివాచి వేయరు. సక్సెస్ వస్తే దాన్ని మైంటైన్ చేసుకోవడం పెద్ద విషయం అంటూ.. సోషల్ మీడియాలో వీడియో రూపంలో తెలియజేశారు. ఇదే సమయంలో ఢీ షో చైతన్య మాస్టర్ ఆత్మకు శాంతి కలగాలని అదిరే అభి అన్నారు.


Share

Related posts

Gopichand – sampath nandi : కామెంట్, విమర్శలు ఎదుర్కొన్న కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కొట్టింది..సెకండ్ వేవ్ తర్వాత బిగ్గెస్ట్ హిట్.

GRK

Liger: విజ‌య్ దేవ‌ర‌కొండ బ‌ర్త్‌డే.. `లైగ‌ర్‌` నుంచి రానున్న బిగ్ ట్రీట్‌!

kavya N

Prabhas: సినిమా సంగతి ఏమో కానీ ప్రభాస్ అంటే పడి చచ్చిపోతోన్న దీపికా పదుకొనే!

Ram