Adivi Sesh: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ పేరు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో మారుమోగిపోతోంది. 2010లో వచ్చిన `కర్మ` మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అడివి శేష్.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో సహాయక పాత్రలను పోషించాడు. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `బాహుబలి`లోనూ `భద్ర` అనే పాత్రలో మెరిశాడు. 2016లో విడుదలైన `క్షణం` మూవీతో అడివి శేష్ కు మంచి బ్రేక్ వచ్చింది. ఆపై `అమీ తుమీ`, `గూఢచారి`, `ఎవరు` వంటి విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన శేష్.. `మేజర్` మూవీతో ఓవర్ నైట్ స్టార్డమ్ ను దక్కించుకున్నాడు.
ముంబై ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన సినిమా `మేజర్`. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సందీప్ గా అడివి శేష్ నటించగా.. ఇతర ముఖ్యమైన పాత్రలను సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ తదితరులు పోషించారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో జూన్ 3న విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకులను విశేషకంగా ఆకట్టుకుంది. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను బ్రేక్ చేసి లాభాల బాట పట్టింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తూనే ఉంది. అయితే మేజర్ సూపర్ సక్సెస్ అయిన సందర్భంగా అడివి శేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో ఎప్పటిలాగానే శేష్ కు పెళ్లిపై ప్రశ్నలు ఎదురవగా.. ఆయన పెళ్లి, ఎఫైర్స్ తో పాటు తన పెయిన్ ఫుల్ లవ్ స్టోరీని కూడా రివిల్ చేశాడు. అడివి శేష్ మాట్లాడుతూ.. `పెళ్లి చేసుకోమంటూ ఇంట్లో ఒకటే ఒత్తిడి చేస్తుండేవారు. ఇప్పుడు అమ్మాయి అయితే చాలు అనే స్టేజ్‌కు వచ్చేశారు. పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి.. ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది ఉన్నారు. సల్మాన్ ఖాన్ వంటి వారున్నారు అని చెప్పి తప్పించుకుంటాను.
అయితే ఆయనలా నాకు మాత్రం ఎవరితోనూ ఎఫైర్స్ లేవు. కానీ, అమెరికాలో ఉన్నప్పుడు ప్రేమలో కాస్త దెబ్బతిన్నా. నా బర్త్ డే నాడే నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయింది.` అంటూ చెప్పుకొచ్చారు. ఇక కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఓవర్ నైట్ సక్సెస్ కావడానికి పది సంవత్సరాలు పట్టింది. మేజర్ మూవీ ఇంత పెద్ద విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ శేష్ పేర్కొన్నాడు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!