Bigg Boss 7 Telugu: తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ ప్రస్తుతం సీజన్ సెవెన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ స్టార్ట్ అయ్యి.. ఐదు వారాలు ముగిసింది. ప్రస్తుతం ఆరో వారం గేమ్ సాగుతోంది. ఈ ఆరో వారంలో కొత్తగా ఐదుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు షో పై.. మాజీ కంటెస్టెంట్ టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 లో భార్య వీతికాతో కలిసి.. వరుణ్ అడుగుపెట్టడం జరిగింది. ఆ సమయంలో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి జంటతో ఎక్కువగా ఈ భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వరుణ్ సందేష్ కూల్ గేమ్ ఆడుతూనే టాప్ ఫైవ్ కి చేరడం జరిగింది. అప్పట్లో సినిమాలు లేక వరుణ్ కెరియర్ పరంగా డౌన్ ఫాల్ చూడటం జరిగింది.
అటువంటి సమయంలో బిగ్ బాస్ షోలో పుంజుకొని మళ్లీ సత్తా చాటారు. అయితే హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత తనకి తన భార్యకి ఎదురైన కొన్ని సంఘటనలు గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వరుణ్ సందేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరుణ్ మాట్లాడుతూ..నా భార్య బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా లో తనకి పెట్టిన మెసేజిలను చూసి ఎంతో మనస్తాపానికి గురి అయ్యింది. చాలా రోజులు తను మనిషి లాగానే లేదు. చనిపోవాలి అనే రేంజ్ డిప్రెషన్ లోకి వెళ్ళింది.
బిగ్ బాస్ యాజమాన్యం వాళ్లకి రేటింగ్స్ వచ్చే విధంగా, ఎన్నో కట్స్ చేసి టీవీ లో టెలికాస్ట్ చేసారు. పాపం రితికా అవి చూసి, అరేయ్ ఇది చూడురా.. ఏమిటో చూపించకుండా ఎడిట్ చేసి టెలికాస్ట్ చేసేసారు.. అంటూ బోరున… ఏడ్చింది. కొన్ని మెసేజ్లు అయితే నోటితో కూడా చెప్పలేం అంత దారుణంగా బూతులు తిట్టారు. ఒక గంట ఎపిసోడ్ చూసి మనిషి వ్యక్తిత్వం ఎలా డిసైడ్ చేస్తారు అంటూ వితికా ఏడ్చింది అని వరుణ్ చెప్పుకొచ్చారు.