Unstoppable 2: ప్రభాస్ “అన్ స్టాపబుల్” రెండు ఎపిసోడ్ లు వీక్షకులను ఎంతగానో అలరించడం తెలిసిందే. బాలకృష్ణ మంచి ఫన్నీ ప్రశ్నలు అడుగుతూ ప్రభాస్ తో షో మంచి ఎంటర్టైన్ అయ్యేలా చేశారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఒకే వేదికపై బాలకృష్ణ ప్రభాస్ రావటంతో ఈ ఎపిసోడ్ చాలా మంది చూడటం జరిగింది. పైగా ప్రభాస్ ప్రారంభం ఎపిసోడ్లో కొద్దిగా సిగ్గు పడినా గాని రెండో ఎపిసోడ్లో మాత్రం బాలకృష్ణతో కలిసిపోయి మరి.. చాలా ఫ్రీగా సమాధానాలు ఇచ్చాడు. పెళ్లి గురించి ఇంకా దివంగత కృష్ణంరాజు మరియు బాహుబలి తర్వాత పరిస్థితి గురించి బాలయ్య అడిగిన ప్రశ్నలు చాలా హైలెట్ గా నిలిచాయి.
మొదటి ఎపిసోడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో ఫోన్ కాల్ సంభాషణ కూడా వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కృతి సన్నాన్ మరియు అనుష్క గురించి ప్రభాస్ ని ఇరుకుని పెడుతూ బాలయ్య అడిగిన ప్రశ్నలు ఎంతో నవ్వులు తీసుకొచ్చాయి. ప్రభాస్ గతంలో కొన్ని షోలకు వచ్చినా గాని చాలా సిగ్గుబిడీయ్యంతో సైలెంట్ ఆన్సర్ లు ఇచ్చేవాడు. కానీ ఈసారి “అన్ స్టాపబుల్” షోలో అనేక ప్రశ్నలకు చాలా నవ్వుతూ కామెడీ పండిస్తూ ప్రభాస్ మాట్లాడటం వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ప్రభాస్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్లకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తూ ఉండటంతో అభిమానులకు ఆహా టీం మరో గుడ్ న్యూస్ తెలియజేసింది. విషయంలోకి వెళ్తే ప్రభాస్ ఎపిసోడ్ కి సంబంధించి మరో కోణం ఉంది అంటూ…అన్ సీన్ వీడియో నేడు రిలీజ్ చేయబోతున్నట్లు ఆహా టీం అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఈ “అన్ స్టాపబుల్” అన్ సీన్ వీడియోలలో ప్రభాస్ నీ మరింత ఇరుకున పెడితే బాలయ్య అడిగిన ప్రశ్నలు ఉన్నట్లు సమాచారం.