NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

Aishwarya Rajinikanth: సినిమా ప్రపంచంలో సెలబ్రిటీలు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, సెట్ అవ్వకపోతే విడాకులు తీసుకుని విడిపోవడం అనేది చాలా కామన్. డైవర్స్ అనంతరం మళ్లీ వివాహం చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కుమార్తె, ప్రముఖ దర్శకురాలు మరియు నేపథ్య గాయ‌ని ఐశ్వర్య రజనీకాంత్ కూడా చేరబోతుందంటూ కోలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

ప్లే బ్యాక్ సింగర్ గా కెరీర్ ప్రారంభించిన ఐశ్వర్య.. 2012లో వచ్చిన 3 మూవీతో దర్శకురాలిగా మెగా ఫోన్ పట్టుకుంది. ధనుష్, శృతిహాసన్ జంటగా నటించిన ఈ చిత్రం కమర్షియల్ గా ఫ్లాప్ అయిం.ది ఆ తరువాత వై రాజా వై, సినిమా వీరన్, లాల్ సలామ్‌ చిత్రాలకు ఐశ్వర్య దర్శకత్వం వహించింది. కానీ ఈ సినిమాలేమీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఐశ్వర్య పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ప్రముఖ స్టార్ హీరో ధనుష్ ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2004 నవంబర్ 18న వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లి సమయానికి ధనుష్ ఇంకా హీరోగా కోలీవుడ్ లో నిలదొక్కుకోలేదు.

అయితే ఐశ్వర్యతో వివాహం జరిగిన తర్వాత రజనీకాంత్ అల్లుడు అనే ట్యాగ్ ధనుష్ కెరీర్ కు చాలా బాగా సహాయపడింది. రజనీకాంత్ ఇమేజ్ ధనుష్ కు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టాయి. అలా తన టాలెంట్ ను నిరూపించుకుంటూ కోలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ధ‌నుష్, ఐశ్వర్య దంపతులకు 2006లో యాత్ర.. 2010లో లింగ అనే కుమారులు జన్మించారు. దాదాపు 18 ఏళ్లపాటు భార్యాభర్తలుగా, స్నేహితులుగా, శ్రేయోభిలాషులుగా ఒక‌రినొక‌రు అర్థం చేసుకుంటూ ప్రయాణం సాగించిన‌ ధనుష్-ఐశ్వర్య అనూహ్యంగా 2022లో విడిపోయారు.

మేమిద్దరం వేరువేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాము. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నామంటూ సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. ఈ ప్రకటన అప్పట్లో పెను సంచలన రేపింది. దాదాపు రెండు దశాబ్దాలు కలిసి కాపురం చేసిన ఈ జంట ఎందుకు విడిపోయారో తెలియక అభిమానులు ఎంతో ఆందోళన చెందారు. అయితే విడివిడిగా ఉన్నా కూడా వీరిద్దరూ విడాకులు తీసుకోలేదు. దాంతో ధనుష్ ఐశ్వర్య ఎప్పటికైనా కలుస్తారని నమ్మకం అభిమానుల్లో ఉంది. కానీ ఇప్పుడు ఆ నమ్మకాన్ని ధనుష్ ఐశ్వర్య పూర్తిగా తుడిచేశారు. ఇటీవల ఈ జంట సెక్షన్ 13b కింద చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. త్వరలోనే వీరి కేసు విచారణకు రాబోతుంది. ఇదే తరుణంలో ఐశ్వర్య కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.

ఐశ్వర్య రెండు పెళ్ళికి రెడీ అవుతుందంటూ కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అందుకే ఐశ్వర్య విడాకులకు అప్లై చేసిందంటూ వార్తలు వస్తున్నాయి. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తో ఐశ్వర్య కొంతకాలం నుంచి డేటింగ్ చేస్తోందట. ఇద్దరూ పెళ్ళి ఆలోచనలో కూడా ఉన్నారని.. లీగ‌ల్ గా ధ‌నుష్ నుంచి విడాకులు పొందిన వెంటనే ఐశ్వర్య సదరు అసిస్టెంట్ డైరెక్టర్ తో పెళ్లి పీటలు ఎక్కనుందని ప్రచారం జరుగుతుంది. ఎలాంటి ఆధారాలు లేకపోయినా కూడా ఐశ్వర్య రెండో పెళ్లి వార్త ఫిలిం సర్కిల్స్ లో మాత్రం గట్టిగా చక్కర్లు కొడుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సింది.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N