33.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit
Entertainment News సినిమా

అఖిల్ `ఏజెంట్` టీజర్.. య‌మా వైల్డ్‌ అంతే!

Share

`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` వంటి హిట్ త‌ర్వాత అఖిల్ అక్కినేని నుండి వ‌స్తోన్న చిత్రం `ఏజెంట్‌`. స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. మ‌ల‌యాళ స్టార్ మమ్ముట్టి కీలకపాత్ర పోషిస్తున్నారు. వక్కంతం వంశీ ఈ మూవీకి క‌థ అందించ‌గా.. హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, సురేందర్‌ 2 సినిమా బ్యాన‌ర్ల‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా `ఏజెంట్‌` టీజ‌ర్‌ను మొత్తం ఐదు భాష‌ల్లో మేక‌ర్స్ బ‌య‌ట‌కు బ‌య‌ట‌కు వ‌దిలారు. హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో అఖిల్ సీక్రెట్ ఏజెంట్ గా అల‌రించ‌బోతున్నాడు.

`ది మోస్ట్ నోటోరియస్.. మోస్ట్ రూత్ లెస్ పేట్రియాట్` అనే డైలాగ్ తో ప్రారంభ‌మైన టీజ‌ర్ య‌మా వైల్డ్‌గా సాగింది. హీరో క్యారెక్ట‌ర్‌ను మమ్ముట్టి వివ‌రించిన తీరు, అఖిల్ యాక్ష‌న్ స్టంట్స్‌ విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. అలాగే అఖిల్ మేకోవ‌ర్ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. కండ‌లు తిరిగిన దేహంతో హాలీవుడ్ హీరో మాదిరి ఆక‌ట్టుకున్నాడు.

మొత్తానికి అదిరిపోయిన టీజ‌ర్‌.. సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. మ‌రి ఆ అంచ‌నాల‌ను అఖిల్ అందుకుంటాడో..లేదో..చూడాలి. కాగా, ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేయబోతున్నట్లు ఇప్ప‌టికే మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. కానీ, రిలీజ్ డేట్ వాయిదా ప‌డే అవ‌కాశాలు ఉన్నాయంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.


Share

Related posts

Bheemla Naayak: సారీ చెప్పిన “బీమ్లా నాయక్”.. ప్రొడ్యూసర్..!!

sekhar

సుకుమార్ అల్లు అర్జున్ ల పుష్ప సినిమా షెడ్యూల్ లో మార్పులు ..ఇప్పుడు షూటింగ్ అక్కడ కాదట ..!

GRK

Sushanth singh Rajputh: హీరో సుశాంత్ కేసులో మరో కోణం ఆత్మహత్య కాదు హత్య..!!

sekhar