అఖిల్‌కు అది పెద్ద త‌ల‌నొప్పిగా మారిన‌ట్లుందే?!

Share

అక్కినేని వంటి బ‌డా ఫ్యామిలీ నుండి వ‌చ్చిన హీరోల్లో అఖిల్ అక్కినేని ఒక‌డు. కెరీర్ స్టార్టింగ్‌లో హ్యాట్రిక్ ఫ్లాప్స్‌ను మూట‌గ‌ట్టుకున్న ఈయ‌న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` వంటి ఫీల్ గుడ్ ఎంట‌ర్టైన‌ర్‌తో స‌క్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ మూవీ అనంత‌రం అఖిల్ నుండి రాబోతున్న చిత్రం `ఏజెంట్‌`. స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు.

ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. మ‌ల‌యాళ స్టార్ మమ్ముట్టి కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత అనీల్ సుంక‌ర భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజ‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది.

ఇక‌పోతే హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 12న విడుద‌ల కావాల్సి ఉన్నా.. ఆ తేదీకి సినిమా రావ‌డం క‌ష్ట‌మే. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ విష‌యం అఖిల్‌తో స‌హా మేక‌ర్స్‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌ట‌. పాన్ ఇండియా చిత్రం కాబట్టి పోటీ లేకుండా సోలోగా రావాలి. పైగా సెలవులు వారాంతాలు కూడా కలిసి రావాలి.

ఈ నేప‌థ్యంలోనే దసరా లేదా క్రిస్మస్ కు విడుద‌ల చేయాల‌ని భావించార‌ట‌. కానీ, దస‌రా రేసులో నాగార్జున `ఘోస్ట్`, చిరంజీవి `గాడ్ ఫాద‌ర్‌` చిత్రాలు ఉన్నాయి. మ‌రోవైపు క్రిస్మ‌స్ రేసులో `అవతార్ 2`, రణవీర్ సింగ్ `సర్కస్` చిత్రాలు ఉన్నాయి. వీటికి పోటీగా దిగితే.. టాక్ ఎంత బాగున్నా క‌లెక్ష‌న్స్‌పై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఎంతైనా ఉంది. అందుకే `ఏజెంట్‌` మేక‌ర్స్ ఓ చ‌క్క‌టి సోలో రిలీజ్ డేట్ కోసం అన్వేషిస్తున్నార‌ట‌.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

18 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago