`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీతో గ్రాండ్‌గా టాలీవుడ్లోకి అడుగు పెట్టిన బాలీవుడ్ స్టార్ కిడ్ అలియా భట్.. ఏప్రిల్‌లో ప్రియుడు, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబైలో వైభవంగా వీరి వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే అలియా భట్ గర్భం దాల్చిడంతో.. రణబీర్ ఈ గుడ్‌న్యూస్‌ను అందరితోనూ షేర్ చేసుకున్నాడు.
అయితే ప్రెగ్నెన్సీ టైమ్‌లోనూ అలియా షూటింగ్స్‌లో పాల్గొంటూ దూసుకుపోతోంది. అలాగే ఈమె తన భర్త రణ్‌బీర్ తో కలిసి నటించిన `బ్రహ్మస్త్ర` సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి ప్రజెంట్ చేయనున్నారు.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. దీంతో అలియా భర్తతో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొంది. అయితే ఇప్పటికి వరకు వరకు అలియా భట్ తన బేబీ బంప్ పైకి కనిపించకుండా కాస్ట్యూమ్స్ ధరించింది.
కానీ, తాజాగా మాత్రం తొలిసారిగా తన బేబీ బంప్ కనిపించేలా డ్రెస్ ధరించి దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.
https://www.instagram.com/reel/Cg6YZm4lptz/?utm_source=ig_web_copy_link