NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Alia Bhatt: ఆలియా భ‌ట్ మెడ‌లో మెరిసిపోతున్న ఆ డైమండ్ నెక్లెస్ ధ‌రెంతో తెలుసా.. 2 ల‌గ్జ‌రీ ఇళ్లు కొనొచ్చు!

Alia Bhatt: బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ల జాబితాలో ఆలియా భట్ ముందు వరుసలో ఉంటుంది. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ మరియు బ్రిటిష్ నటి సోనీ రజ్దాన్ దంపతులకు అలియా భ‌ట్ జ‌న్మించింది. 20 ఏళ్ల వయసులో కరణ్ జోహార్ యొక్క స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో ఆలియా భ‌ట్ హీరోయిన్ గా సినీ గ‌డ‌ప తొక్కింది. ఇదే చిత్రంతో సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. 2012లో విడుద‌లైన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీ మంచి విజ‌యం సాధించింది. కానీ లుక్స్ ప‌రంగా, యాక్టింగ్ ప‌రంగా ఆలియా భ‌ట్ కొన్ని విమ‌ర్శ‌కుల‌ను ఎదుర్కొంది.

దాంతో కాస్త నిరుత్సాహానికి గురైన ఆలియా భ‌ట్‌.. గ్లామ‌ర్ ప్ర‌పంచంలో త‌న‌ను తాను నిరూపించుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. రెండో సినిమా హైవే మూవీతో ఉత్తమ న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత‌ 2 స్టేట్స్, హంప్టీ శర్మ కీ దుల్హనియా, అగ్లీ, షాంద‌ర్‌, కపూర్ & సన్స్ ఇలా వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ అన‌తి కాలంలోనే బాలీవుడ్ లో స్టార్ హోదాను అందుకుంది. సినీ నేప‌థ్యం ఉన్న‌టువంటి కుటుంబం నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ సొంత టాలెంట్ తో ఉన్న‌త స్థాయికి చేరుకుంది. నెపోటిజం పేరుతో ఎంత మంది విమ‌ర్శించినా.. ఆలియా భ‌ట్ మాత్రం వారికి త‌న ప‌నిత‌నంతోనే స‌మాధానం ఇచ్చింది.

2022లో వ‌చ్చిన గంగూబాయి కతియావాడి మూవీతో ఆలియా భ‌ట్ ఇమేజ్ డ‌బుల్ అయింది. ఈ చిత్రంలో ఆమె త‌న న‌ట‌న‌తో విమ‌ర్శ‌కుల‌ను సైతం మెప్పించింది. అదే ఏడాది ఆర్ఆర్ఆర్ మూవీతో సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి రూపొందించిన ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించారు. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా సీత పాత్ర‌లో ఆలియా భ‌ట్ అల‌రించింది. త‌న‌దైన అందం, ఆక‌ట్టుకునే న‌ట‌న‌తో తెలుగు వారికి చేరువైంది.

ప్ర‌స్తుతం ఓవైపు ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌ను, మ‌రోవైపు ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్న ఆలియా భ‌ట్‌.. రీసెంట్ గా లండన్‌లో జరిగిన హోప్ గాలా 2024 ఈవెంట్‌లో సంద‌డి చేసింది. మ‌న భార‌త‌దేశంలో వెనుకబడిన వర్గాల్లోని యువతీయువకులను సాయం చేసేందుకు సలామ్ బొంబే ఫౌండేషన్ ఈ ఈవెంట్ ను నిర్వ‌హించారు. ఆలియా భ‌ట్ హోప్ గాలా ఈవెంట్ ను హోస్ట్ చేసింది. ఈ ఈవెంట్ లో 30 ఏళ్ల నాటి ఐవరీ రేషమ్ వింటేజ్‌ శారీని కొత్తగా డిజైన్‌ చేయించుని మరీ ధరించింది. స్టయిలిష్‌ లుక్‌తో అంద‌రినీ మిస్మ‌రైజ్ చేసింది.

అలాగే ఇదే ఈవెంట్ లో మెరూన్ కలర్ ఫుల్ ఫ్రాక్ ధరించి ఆక‌ట్టుకుంది. ఈ అవుట్ ఫిట్ కు పెయిర్ అప్ చేస్తూ మెడ‌లో బ్లూ డైమండ్ నెక్లెస్ ను వేసుకుంది. అయితే ఇప్పుడు ఈ డైమండ్ నెక్లెస్ ధ‌ర నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఆలియా భ‌ట్ మెడలో మెరిసిపోతూ క‌నిపిస్తున్న ఆ డైమండ్ నెక్లెస్ చూడ‌టానికి చాలా సింపుల్ గా ఉన్నా కూడా.. దాని ధ‌ర మాత్రం 2.5 మిలియన్ డాలర్స్ అని ప‌లు నివేదిక‌లు చెబుతున్నాయి. మ‌న ఇండియ‌న్ క‌రెన్సీలో చెప్పాలంటే దాదాపుగా రూ.20 కోట్లు. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు షాకైపోతున్నారు. రూ. 20 కోట్లు పెడితే 2 ల‌గ్జ‌రీ ఇళ్లు కొనొచ్చ‌ని కామెంట్స్ చేస్తున్నారు.

author avatar
kavya N

Related posts

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

AP SSC Results: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయోచ్ .. పార్వతీపురం మన్యం ఫస్ట్ .. కర్నూల్ లాస్ట్.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

sharma somaraju

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu