Entertainment News సినిమా

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

Share

అల్లు అర్జున్  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తే.. ఫహాద్‌ ఫాజిల్, సునీల్ విల‌న్లుగా న‌టించారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొత్తం ఐదు భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది.ఈ చిత్రంతో బ‌న్నీ ఇమేజ్ డ‌బుల్ అయిపోయింది. నార్త్‌లోనూ ఈయ‌న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం బ‌న్నీ `పుష్ప పార్ట్ 2` షూటింగ్ కు సిద్ధం అవుతున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్లాల్సి ఉంది. కానీ, సుకుమార్ స్క్రిప్ట్‌లో ప‌లు మార్పులు చేర్చులు చేస్తుండ‌టం వ‌ల్ల‌.. చిత్రీక‌ర‌ణ ఆల‌స్యం అవుతోంది.

అయితే ఈ గ్యాప్‌లో బ‌న్నీ ప‌లు బ్రాండ్స్‌ను ప్ర‌మోట్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్ప‌టికే కోకా కోలా, అస్ట్రాల్, రెడ్ బస్, కేఎఫ్‌సీ, జోమాటో తదితర బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న బ‌న్నీ.. ఒక్కో వాణిజ్య ప్రకటన కోసం రూ. 7 కోట్ల రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్‌ను అందుకుంటున్నాడు.

అయితే రీసెంట్‌గా ఓ గుట్కా బ్రాండ్, లిక్కర్ కంపెనీ తమకు బ్రాండ్ అంబాసిండర్‌గా వ్యవహరించాలని అల్లు అర్జున్‌ను సంప్ర‌దించాయ‌ట‌. అందుకగానూ స‌ద‌రు సంస్థ రూ. 10కోట్లను రెమ్యూనరేషన్‌గా చెల్లిస్తామని ఆఫ‌ర్ చేశార‌ట‌. అయినాస‌రే స‌ద‌రు బ్రాండ్‌ను ప్ర‌మోట్ చేయ‌న‌ని బ‌న్నీ చెప్పేశార‌ట‌. ఎందుకంటే, గుట్కా, లిక్కర్ బ్రాండ్స్, సరోగేట్స్ ప్రచారాలకు బన్నీ వ్యతిరేకం. గ‌తంలో కూడా ఇలాంటి ఆఫ‌ర్ల‌ను ఆయ‌న తిర‌స్క‌రించర‌ని వార్త‌లు వ‌చ్చాయి.


Share

Related posts

Ram charan: చరణ్ సినిమాకు హీరోయిన్ విషయంలో ఛాయిస్ లేదా..?

GRK

Sonali Bendre: చాలా తెలివిగా రీఎంట్రీ ఇస్తున్న సోనాలి బింద్రే..??

sekhar

బిగ్ బాస్ 4 : మరో ఇద్దరు మగాళ్ళ మధ్య చిచ్చు పెట్టేసిన మోనాల్..! చివరికి అనుభవించింది l…

arun kanna