సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది నటించిన చిత్రం “పుష్ప”. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సరిగ్గా ప్రమోషన్ కార్యక్రమాలు చేయకపోయినా గానీ అక్కడ 100 కోట్లకు పైగానే కలెక్షన్ రావటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఊహించని రీతిలో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా “పుష్ప” ఒక ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచింది. “పుష్ప”లో బన్నీ పలికిన డైలాగులు.. మేనరిజమ్స్ ప్రపంచవ్యాప్తంగా సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీలు ఇంకా ఇంటర్నేషనల్ క్రికెటర్ లు.. బాగా ఇమిటేట్ చేయడం జరిగింది.
ఇప్పటికీ కూడా కొన్ని రాజకీయ పార్టీల నాయకులు సైతం “పుష్ప” డైలాగులు బహిరంగ సభలలో చెబుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఫస్ట్ పార్ట్ “పుష్ప” కేవలం నాలుగు భాషల్లో మాత్రమే.. విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా విజయం సాధించిన సమయంలో.. సక్సెస్ మీట్ లో బన్నీ…”పుష్ప 2″ గురించి మాట ఇవ్వడం జరిగింది. అదేమిటంటే “పుష్ప” కంటే “పుష్ప 2” వీలైనంత ఎక్కువ భాషల్లో తెరకెక్కిస్తామని మాట ఇచ్చారు.
కాగా ఇప్పుడు ఇచ్చిన మాట నెరవేర్చే దిశగా “పుష్ప 2” పది భాషల్లో తేరాకెక్కించడానికి రెడీ అయ్యారట. వచ్చేనెల ఆగస్టు నుండి “పుష్ప 2” షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో ఆ పది భాషలను దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ సుకుమార్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే “పుష్ప 2″కి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రం ఒక రెండు నెలల పాటు గట్టిగా చేయాలని.. సినిమా యూనిట్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు టాక్.