అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. బన్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ దంపతులకు 2014లో కొడుకు అయాన్, 2016లో కూతురు ఆర్హా పుట్టారు. వివాహం అనంతరం అల్లు అర్జున్ కెరీర్ మరింత ఊపందుకుంది.
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడిగా ముద్ర వేయించుకున్నాడు. ఇక స్నేహా విషయానికి వస్తే.. హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని అందం ఆమె సొంతం. ఈమె సినీ ఇండస్ట్రీకి రాలేదు కానీ.. వచ్చుంటే మాత్రం స్టార్ హీరోయిన్ గా వెండితెరను ఏలేసేవారని అంటుంటారు. అయితే సినిమాలు చేయకపోయినా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
ప్రస్తుతం స్నేహాకు ఇన్‌స్టా 8.3 మిలయన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే.. ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమె ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇకపోతే ఇటీవల కాలంలో స్నేహా రెడ్డి హీరోయిన్ల మాదిరి గ్లామర్ షోకు తెర లేపింది. ట్రెండీ దుస్తుల్లో ఫొటో షూట్లు చేసి.. ఆ పిక్స్తోనూ ఇన్‌స్టా ద్వారా షేర్ చేస్తూ నెటిజన్లు విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తోంది.
తాజాగా కూడా ట్రెండీ డిజైనర్ శారీలో సూపర్ గ్లామరస్ గా మెరిసిపోయింది. ఇందుకు సంబంధించి పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. వాటిని చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అంత అందంగా ఆమె కనిపిస్తోంది. ఇద్దరు పిల్లకు తల్లి అంటే ఎవరూ నమ్మరని, హీరోయిన్లకే తన అందంతో స్నేహా అసూయ పుట్టిస్తుందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి స్నేహా తన గ్లామర్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది.