NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Alluri Sitarama Raju: కొన్ని పాత్రలు కొందరి కోసం తయారు చేసినట్లు అనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుత కాలంలో ఇలా అనిపించకపోయినా సీనియర్ హీరోలు నటించిన పాత్రలు అయితే అలానే అనిపిస్తాయి. అటువంటి పాత్రలలో నటించిన హీరోలు ఎందరో ఉన్నారు. ఆ పాత్రల దగ్గరికి మరే హీరో కూడా వెళ్లలేరు. మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్రలు ఎన్నో ఉన్నాయి. వాటిలో అల్లూరి సీతారామరాజు పాత్ర కూడా ఒకటి. ఈ పాత్రలో నటించే అపురూపమైన అవకాశం సూపర్ స్టార్ కృష్ణ కి దక్కింది. ఆయన తప్ప ఈ పాత్రకు ఇంకెవరు న్యాయం చేయలేరేమో అన్నంతగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు కృష్ణ.

Alluri Sitarama Raju completed 50 years
Alluri Sitarama Raju completed 50 years

ఆయన కెరీర్ లో ఈ చిత్రం ఓ మైలురాయి అని చెప్పొచ్చు. అల్లూరి సీతారామరాజు విడుదలై నేటికి సరిగ్గా 50 ఏళ్లు ముగిసాయి. కృష్ణ డ్రీమ్ రోల్స్ లో అల్లూరి ఒకటి. ఆయన చిత్రాల్లోకి రాకముందు నుంచి అల్లూరు సీతారామరాజు పాత్ర చేయాలని అనుకున్నారట. ఇక అందుకు ఎన్టీఆర్ కూడా ఓ బలమైన కారణమే. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన అగ్గి రాముడు సినిమాలో అల్లూరి ధైర్య సాహసాలని చెప్పే సన్నివేశం ఉంటుంది. అది కృష్ణకు చాలా ఇష్టమట. అప్పట్లో ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు సినిమా చేద్దామనుకున్నారు. లుక్ టెస్ట్ కూడా జరిగిందట. అది బయటకు వచ్చింది కూడా. అలా అల్లూరి సీతారామరాజు గెటప్.. కృష్ణని బాగా ఊరించింది.

ఆ తరువాత కృష్ణ హీరో అయ్యాడు. అసాధ్యుడు లో కనిపించింది కాసేపే అయినప్పటికీ ఆ లుక్ తనలో ధైర్యాన్ని నిలిపింది. ఎన్టీఆర్ కొన్ని కారణాల చేత అల్లూరి స్క్రిప్ట్ పక్కన పెట్టడంతో కృష్ణ స్వయంగా తన భుజాలపై వేసుకున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ పద్మాలయా స్టూడియోస్ లో ఈ చిత్రాన్ని తెరికెక్కించారు. 1973 డిసెంబర్ లో అప్పటి మద్రాస్ వాహిని స్టూడియోలో అల్లూరి సీతారామరాజు షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రం కోసం చింతపల్లి అడవుల్లో భారీ సెట్స్ వేశారు. చిత్ర బృందం అంతా షూటింగ్ జరిగిన్నీ రోజులు అక్కడే బస వేసి 40 రోజుల్లో సినిమా పూర్తి చేశారు. ఇక ఈ చిత్రానికి రామచందర్రావు దర్శకుడిగా వ్యవహరించాడు.

అయితే కొంతమేర షూటింగ్ జరిగాక ఆయన అస్వస్థకు గురవ్వడం వల్ల.. అర్ధాంతరంగా కన్నుమూశారు. దీంతో మిగిలిన భాగానికి కృష్ణ దర్శకత్వం వహించారు. కొన్ని సన్నివేశాలని కేఎస్ఆర్ దాస్ డైరెక్టర్ చేశారు. అయితే తెరపై దర్శకుడిగా రామచంద్రరావు పేరే పడింది. అది కృష్ణకు ఆయనపై ఉన్న గౌరవం. 1974 మే 1న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. తెలుగులో నిర్మతమైన తొలి సినిమా స్కోప్ చిత్రంగా రికార్డ్స్ సృష్టించింది. ఇక అప్పట్లోనే రెండు కోట్లు కలెక్షన్స్ రాబట్టి సంచలనం క్రియేట్ చేసింది. ఇక నేటితో ఈ సినిమా విడుదల 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు అంటే రెండు కోట్లు చిన్నగా అనిపిస్తున్నాయి కానీ. అప్పట్లో రెండు కోట్లు సాధించిన సినిమా అంటే బ్లాక్ బస్టర్ కంటే ఎక్కువగా చూసేవారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella