అమెజాన్ ప్రైమ్‌కి `సీతారామం`.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా?

Share

మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `సీతారామం`. ఇందులో ర‌ష్మిక మంద‌న్నా కీల‌క పాత్ర‌ను పోషించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యాన‌ర్ పై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

సుమంత్‌, త‌రుణ్ భాస్క‌ర్‌, భూమిక, గౌతమ్ మీనన్ త‌దిత‌రులు ఇత‌క‌ర ముఖ్య పాత్ర‌ల్లో మెరిశారు. దేశ‌భ‌క్తి, ప్రేమ అంశాల నేప‌థ్యంలో ఓ అద్భుత‌మైన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగ‌స్టు 5న విడుద‌లై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో లెఫ్టినెంట్ రామ్ గా దుల్క‌ర్‌, సీత‌గా మృణాల్ విశేషంగా ఆక‌ట్టుకున్నారు.

సినిమాలో అనేక పాత్రలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క పాత్రని దర్శకుడు హను చ‌క్క‌గా మలిచి ప్ర‌శంస‌లు అందుకున్నాడు. సినిమాల్లో వ‌చ్చే ట్విస్ట్ లు కూడా ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేస్తాయి. మొత్తానికి పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఇక‌పోతే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఓ క్రేజీ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాని ప్ర‌కారం.. `సీతారామం` అన్ని భాష‌ల డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌నూ ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధ‌ర‌కు సొంతం చేసుకుంద‌ట‌. అయితే స్ట్రీమింగ్ మాత్రం థియేట‌ర్స్‌లోకి వ‌చ్చిన ఆరు వారాల త‌ర్వాతే చేయ‌ల‌ని మేక‌ర్స్ డీల్ కుదుర్చుకున్నార‌ట‌. అంటే ఈ సినిమా సెప్టెంబ‌ర్ ఆఖ‌రిలో లేదా అక్టోబ‌ర్ ఆరంభంలో స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

8 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

1 hour ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago