Unstoppable 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “అన్ స్టాపబుల్” షోకి రావడం తెలిసిందే. ఈరోజు ఉదయం మొత్తం పవన్.. బాలయ్య “అన్ స్టాపబుల్” షోకి సంబంధించి వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరి మధ్య సినిమాల కంటే ఎక్కువగా రాజకీయాలకు సంబంధించి డిస్కషన్ జరిగినట్లు లీక్ వార్తలు వస్తున్నాయి. అయితే ఇద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ ఫన్నీ కన్వర్జేషన్ జరిగిందంట. అదేమిటంటే పవన్ కళ్యాణ్ నటించిన “గుడుంబా శంకర్” సినిమాలో ఆయన ధరించిన ఫ్యాంట్ గురించి.. బాలయ్య కొన్ని ప్రశ్నలు వేయడం జరిగిందంట.

దానికి పవన్ తనదైన శైలిలో సమాధానాలు చెప్పారట. ఇక ఇదే సమయంలో బాలకృష్ణ సినిమాలలో తొడ కొట్టడం గురించి పవన్ కూడా ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఇంక రాజకీయాలలో డ్రెస్సింగ్ గురించి కూడా చర్చ జరిగిందంట. ఈ క్రమంలో వేసే దుస్తులు బట్టి కాదు మనసు బట్టి రాజకీయాలు చేయాలని పవన్.. చెప్పారట. ఇంకా జగన్ నీ టార్గెట్ చేసుకున్ని చేసే విమర్శలు వంటి విషయాలు..మూడు పెళ్ళిలు…గురుంచి కూడా డిస్కషన్ జరిగిందట. అదే విధంగా చిరంజీవి గురుంచి కూడా బాలయ్య కొన్ని ప్రశ్నలు వేయడం జరిగిందట. దాదాపు ఆరు గంటలపాటు షూటింగ్ జరిగినట్లు సమాచారం.

బాలకృష్ణ… పవన్ చాల ఎంజాయ్ చేశారట. కాగా మధ్యలో త్రివిక్రమ్ తో పాటు సాయిధరమ్ తేజ్ ఇంకా క్రిష్ కూడా జాయిన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ షోకి సంబంధించిన ప్రోమో… డిసెంబర్ 31తారీఖు నాడు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. సంక్రాంతి పండుగ కానుకగా “అన్ స్టాపబుల్” బాలకృష్ణ.. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈనెల 30వ తారీఖు ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. రెండో సీజన్ చివరి ఆఖరికి వస్తూ ఉండటంతో… పవన్ కళ్యాణ్ తో ముగింపు ఎపిసోడ్ చేసినట్లు టాక్.