అనన్య నాగళ్ల.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలంగాణలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ `మల్లేశం` మూవీ తో కెరీర్ ప్రారంభించింది. ఓటీటీ వేదికగా విడుదలైన `ప్లే బ్యాక్` సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన అనన్య.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ `వకీల్ సాబ్` చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం గత ఏడాది ఏప్రిల్లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో దివ్య నాయక్ అనే ఓ కీలకమైన పాత్రను అనన్య పోషించి ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా తరవాత అనన్య కు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతాయని అందరూ భావించారు.
కానీ అందుకు భిన్నంగా ఆమె కెరీర్ సాగుతోంది. వకీల్ సాబ్ తర్వాత అనన్య నుంచి మరో మూవీ రాలేదు. కొత్త ప్రాజెక్టుల అనౌన్స్మెంట్ లు లేవు. కానీ సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతుంది. ఇదిలా ఉంటే రీసెంట్గా అనన్య పెళ్లి పీటలెక్కబోతోందంటూ వార్తలు వచ్చాయి.
బడా ప్రొడ్యూసర్ తనయుడితో ఆనన్య వివాహం జరగబోతోందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారం పై అనన్య ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. `నాకోసం వరుడిని చూసినందుకు ధన్యవాదాలు. అయితే పెళ్లి ఎప్పుడు.. ఎక్కడ చేస్తున్నారో దయచేసి నాకు తెలియజేయండి. దాని వల్ల నా పెళ్ళికి నేను కూడా హాజరవుతాను` అంటూ ట్వీట్ చేసింది. మొత్తానికి తన పెళ్లి వార్తల్లో ఎటువంటి నిజం లేదని అనన్య తేల్చేసింది.
https://twitter.com/AnanyaNagalla/status/1576435975240445952?s=20&t=w-Af0lseFhQVLgrk0Tvdag