Entertainment News సినిమా

టాలీవుడ్‌లో ఆ హీరో అంటే ఇష్ట‌మ‌న్న `లైగ‌ర్‌` బ్యూటీ.. విజ‌య్ ఫ్యాన్స్ హ‌ర్ట్‌!

Share

బాలీవుడ్ స్టార్ కిడ్ అన‌న్య పాండే త్వ‌ర‌లోనే `లైగ‌ర్` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ మూవీ ఇది. రమ్యకృష్ణ, ప్ర‌పంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, మకరంద్ దేశ్‌పాండే త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

ఇందులో విజ‌య్ బాక్స‌ర్‌గా అల‌రించ‌బోతున్నాడు. పైగా ఆయ‌న పాత్ర‌కు న‌త్తి ఉండ‌టం మ‌రో విశేషం. ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగ‌స్టు 25న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ అన్ని భాష‌ల్లోనూ విసృతంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలను నిర్వ‌హిస్తూ.. సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా అన‌న్య విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. అయితే ఈ ఇంట‌ర్వ్యూలో అన‌న్య పాండేకు.. `టాలీవుడ్ లో మీ ఫేవరెట్ హీరో ఎవ‌రు..? అనే ప్ర‌శ్న ఎదురైంది.

అందుకు అన‌న్య ట‌క్కున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటూ స‌మాధానమిచ్చింది. అల్లు అర్జున్ అంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని, ఆయ‌న చేసిన సినిమాల్లో `అల వైకుంఠపురములో` చూశాననీ, ఆయన యాక్టింగ్ కి ఫిదా అయ్యానని చెప్పుకొచ్చింది. అయితే ఈ విష‌యంపై విజ‌య్ ఫ్యాన్స్ కాస్త హ‌ర్ట్ అయ్యార‌ట‌. విజ‌య్ మూవీతో టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్న అన‌న్య‌.. అల్లు అర్జున్ అంటే ఇష్ట‌మ‌ని చెప్ప‌డం వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు. కానీ, ఎవ‌రి ఇష్టం వారిది.. అన‌న్య‌కు బ‌న్నీ అంటే ఇష్టం కాబ‌ట్టి అత‌డి పేరే చెప్పింది.


Share

Related posts

జపాన్ లో ప్రభాస్ క్రేజ్ ముందు .. ఏపీ , తెలంగాణా ఫాన్స్ కూడా పనికిరారు !

GRK

బాల‌య్య త‌దుప‌రికి సిద్ధ‌మ‌వుతున్నారా?

Siva Prasad

అదిరిపోయిన `గాడ్ ఫాద‌ర్‌` టీజ‌ర్‌.. మెగా ఫ్యాన్స్‌కి పూన‌కాలే!

kavya N