NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

Sreemukhi: టాలీవుడ్ లో ఉన్న ఫిమేల్ స్టార్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకటి. సూపర్ సింగర్ 9 అనే కార్యక్రమం ద్వారా వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించిన శ్రీముఖి.. తనదైన గ్లామర్ మరియు ప్రతిభతో టెలివిజ‌న్ రంగంలో సూపర్ సక్సెస్ అయింది. ఎనర్జిటిక్ యాంకరింగ్ తో బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకుంది. టెలివిజన్ లో ఇప్పటివరకు ఎన్నో షోలను హిట్ చేసింది. ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ప్రధానంగా మాటీవీ, జీ తెలుగు ఛానెల్స్ లో ప్రసారమయ్యే షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

అలాగే అవకాశం వచ్చినప్పుడల్లా అడపా తడపా చిత్రాల్లో నటిస్తోంది. చివ‌ర‌గా మెగాస్టార్ చిరంజీవి యొక్క భోళా శంక‌ర్ సినిమాలో క‌నిపించింది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీ‌ముఖి.. ప్రతి నిత్యం అదిరిపోయే ఫోటో షూట్లతో నెటిజన్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇదిలా ఉంటే.. శ్రీముఖి పెళ్లికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తాజాగా తెరపైకి వచ్చింది. మూడు పదుల వయసు దాటి నాలుగు పదుల్లోకి ఎంటర్ కాబోతున్న శ్రీముఖి ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ఎప్పటినుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు.

అయితే ఆ టైమ్‌ రానే వచ్చింది. ఈ ఏడాదే శ్రీముఖి పెళ్లి పీటలెక్కబోతోందట. తన సింగిల్ లైఫ్ కు ఎండ్ కార్డు వేసి మింగిల్ కాబోతుందట. ఈ గుడ్ న్యూస్ ను తాజాగా శ్రీముఖి బెస్ట్ ఫ్రెండ్ మరియు జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ రివీల్ చేశాడు. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా శ్రీముఖి, అవినాష్ మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. ఇద్దరూ ఫ్యామిలీ మెంబర్స్ లా ఉంటారు. అయితే తాజాగా అవినాష్ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలను పంచుకున్నాడు.

ఈ క్రమంలోనే శ్రీముఖి పెళ్లి ప్రస్తావన రాగా.. అవినాష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం శ్రీముఖి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని.. బహుశా ఈ సంవ‌త్స‌ర‌మే ఆమె వివాహం జరగొచ్చని అవినాష్ చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్ళు పెళ్లిపై శ్రీముఖి పెద్దగా ఇంట్రెస్ట్ చెప్పలేదు.. కానీ ఈ మధ్య ఆమె వైపు నుంచి కూడా పాజిటివ్ సైన్ ఉందని అవినాష్ తెలిపాడు. దీంతో శ్రీముఖి అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఈ ఏడాది బుల్లితెర రాములమ్మ పెళ్లి కావ‌డం ఖాయ‌మని సంబరపడుతున్నారు.

కాగా, గతంలో శ్రీముఖి పెళ్లి వార్తలు పలుమార్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ యాంకర్ కమ్‌ హీరో ప్రదీప్ మాచిరాజుతో శ్రీముఖి ప్రేమాయణం నడిపిస్తుందని.. ఇద్ద‌రూ పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రచారాన్ని ప్రదీప్ మ‌రియు శ్రీముఖి కొట్టి పారేశారు. ఆ తర్వాత ఓ వ్యాపారవేత్తతో శ్రీముఖి వివాహం కానుందుని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు కూడా చివరికి పుకార్లుగానే మిగిలాయి. మరి అవినాష్ చెప్పినట్లు ఈ ఏడాది అయినా శ్రీముఖి వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుందా..? లేదా..? అన్నది చూడాలి.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N