Unstoppable 2: ఆహా “అన్ స్టాపబుల్” టాకీ షో దేశంలోనే సంచలనం సృష్టిస్తుంది. అన్ని టాకీ షోలలో కంటే ఎక్కువ వ్యూస్ రాబడుతూ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. హోస్ట్ గా బాలకృష్ణ విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. వెండి ధర మీద మాత్రమే కాదు బుల్లితెరపై కూడా తనకు తిరిగు లేదని నిరూపించుకుంటున్నాడు. సెలబ్రిటీలను రాజకీయ నాయకులను తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ అద్భుతమైన కామెడీ పండిస్తున్నారు. మంచి ఎనర్జిటిక్ గా షోలో బాలయ్య చేసే కామెడీ చూసే వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది.
షోకి వచ్చే అతిథికి ఎక్కడా కూడా అసౌకర్యం కలిగించకుండా… పంచతరహాలు ఎటకారంగా సమయస్ఫూర్తిగా బాలయ్య ప్రశ్నలు షో పట్ల మరింత ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తున్నాయి. ఇదిలా ఉంటే మొదటి సీజన్ కి భారీ రెస్పాన్స్ రావడం తెలిసిందే. ఈ క్రమంలో మొదటి సీజన్ కంటే సెకండ్ సీజన్ మరింత గ్రాండ్ గా ఉండే విధంగా ఆహా టీం షోనీ ముందుకు నడిపిస్తుంది. ఇదిలా ఉంటే సెకండ్ సీజన్ న్యూ ఇయర్ కి ముందు ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కావడం తెలిసిందే.
ఈ ఎపిసోడ్ మధ్యలో రామ్ చరణ్ తేజ్ తో ఫోన్ మాట్లాడటం జరిగింది. ఆ సమయంలో కచ్చితంగా మీ షో కి రావాలనుకుంటున్నాను సార్ అని బాలకృష్ణతో చరణ్ తెలియజేశాడు. అందుకు ఎంతో దూరం లేదు.. ఒక పిలుపు మాత్రమే అని తెలియజేయడం జరిగింది. షోని చూస్తున్నట్లు కూడా చరణ్ చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడు ఆహా టీం చరణ్ నీ కూడా ఈ సెకండ్ సీజన్ చివరిలో తీసుకురావడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో రాంచరణ్ ఆన్ స్టాపబుల్ ఎపిసోడ్ కి సంబంధించి న్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.