Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభం కాకముందే ఉల్టా పుల్టా మాదిరిగా ఉంటుందని నాగార్జున యాడ్ లో చెప్పటం తెలిసిందే. అయితే ఇప్పుడు హౌస్ లో అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సీజన్ స్టార్ట్ అయ్యాక 14 మంది ఎంట్రీ యోగ ఆల్రెడీ నలుగురు వెళ్లిపోయారు. ప్రస్తుతం 10 మంది ఉన్నారు. ఇంతవరకు హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ నిర్వహించలేదు. ఐదవ వారంలో కెప్టెన్సీ టాస్క్ జరుగుతూ ఉంది. కానీ గత సీజన్ లా మాదిరిగా కాకుండా… ఈసారి మొదటి రోజు నుండే హౌస్ లో పోటీ వాతావరణం నెలకొంది.
ప్రతి దానికి ఇంటి సభ్యులకు టాస్క్ పెట్టి బిగ్ బాస్ షోపై చూసే ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగించేలా చేశారు. ఇదిలా ఉంటే అక్టోబర్ ఆరవ తారీకు మరో ట్విస్ట్ చూసే ప్రేక్షకులకు ఇవ్వటానికి షో నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే ఆరోజు మినీ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ నిర్వహించబోతున్నారట. ఆరోజు హౌస్ లో మరికొంతమంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మినీ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ఎపిసోడ్… అక్టోబర్ 8 లేదా 9వ తారీకు ప్రసారం చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి హౌస్ లోకి నాయని పావని, నిఖిలు, అంజలి పవన్, అర్జున్ అంబటి, సింగర్ బోలె, పూజ మూర్తి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో అప్పటినుంచి అసలు అయిన గేమ్ హౌస్ లో స్టార్ట్ కాన ఉందని సమాచారం. ఎవరికి అర్థం కాని రీతిలో ఈసారి సీజన్ ప్లాన్ చేశారని పైగా ఆ రోజు నుండే వండే వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతున్న క్రమంలో షోనిర్వాహకులు ఈ రీతిగా జాగ్రత్త పడినట్లు టాక్. ఎక్కడా కూడా షో రేటింగ్ పడిపోకుండా చాలా పక్కా ప్లానింగ్ తో సీజన్ సెవెన్ సక్సెస్ అయ్యేలా నిర్వాహకులు రెడీ అయ్యారట. అంతేకాదు నాలుగో వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయిన రతిక మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి.
Karthika Deepam: కార్తీకదీపం నుంచి మోనిత అవుట్..! కొత్త క్యారెక్టర్ ఇన్..! అదే ట్విస్టు..!