Ante Sundaraniki: న్యాచురల్ స్టార్ నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `అంటే..సుందదానికీ!`. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ మూవీలో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించింది.
లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ మూవీ జూన్ 10న విడుదలై.. మంచి స్పందనను దక్కించుకుంది. కానీ, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం అంతంగా మాత్రగానే ఉన్నాయి. వీకెండ్ వరకు పర్వాలేదనిపించుకున్నా.. వర్కింగ్ డేస్‌లో ఈ మూవీ మరింత డల్ అయిపోయింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వీకెండ్ పూర్తి అయ్యే సమయానికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.40 కోట్ల షేర్ వసూల్ చేసిన ఈ చిత్రం.. సోమవారం రూ. 71 లక్షల షేర్ సొంతం చేసుకుంది. ఇక ఐదో రోజు రూ. 46 లక్షల షేర్ తో సరిపెట్టుకుంది. ఇక ఏరియాల వారీగా `అంటే.. సుందరానికీ` ఐదు రోజుల టోటల్ కలెక్షన్స్‌ను ఓ సారి గమనిస్తే..
నైజాం – రూ. 5.22 కోట్లు
సీడెడ్ – రూ. 1.12 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.31 కోట్లు
ఈస్ట్ – రూ. 0.92 కోట్లు
వెస్ట్ – రూ. 0.78 కోట్లు
గుంటూరు – రూ. 0.85 కోట్లు
కృష్ణా – రూ. 0.81 కోట్లు
నెల్లూరు – రూ. 0.56 కోట్లు
—————————–
ఏపీ+తెలంగాణ=11.57 కోట్లు (19.60కోట్లు~ గ్రాస్)
—————————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 1.25 కోట్లు
ఓవర్సీస్ – 4.50 కోట్లు
—————————-
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్= 17.32 కోట్లు (30.55 కోట్లు~ గ్రాస్)
—————————-
కాగా, ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అవ్వాలంటే మొదటి ఐదు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 13.68 కోట్ల షేర్‌ను వసూల్ చేయాల్సి ఉంది. మరి అంత భారీ టార్గెట్‌ను నాని అందుకుంటాడో..లేదో..చూడాలి.