Ante Sundaraniki: `శ్యామ్ సింగరాయ్` వంటి బిగ్ హిట్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని నుంచి వచ్చిన తాజా చిత్రం `అంటే..సుందదానికీ!`. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్లోకి అడుగు పెట్టింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ జూన్ 10న విడుదలై.. మంచి స్పందనను దక్కించుకుంది. కానీ, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం ఊహించిన స్థాయిలో రావడం లేదు. అడివి శేష్ `మేజర్`, కమల్ హాసన్ `విక్రమ్` చిత్రాలు పోటీలో ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక వీకెండ్ తర్వాత కలెక్షన్స్ పరంగా నాని మరింత వీక్ అయ్యాయి. వీకెండ్ పూర్తి అయ్యే సమయానికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.40కోట్లు షేర్ వసూల్ చేసిన ఈ చిత్రం.. సోమవారం వచ్చే సరికి రూ. 71 లక్షల షేర్ తో సరిపెట్టుకుంది. ముందు ముందు కూడా ఈ ఫ్లోనే కొనసాగితే.. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అందుకోవడం చాలా కష్టమవుతుందని అంటున్నారు. ఇక ఏరియాల వారీగా `అంటే.. సుందరానికీ` నాలుగు రోజుల టోటల్ కలెక్షన్స్‌ను ఓ సారి గమనిస్తే..
నైజాం – రూ. 4.94 కోట్లు
సీడెడ్ – రూ. 1.11 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.25 కోట్లు
ఈస్ట్ – రూ. 0.89 కోట్లు
వెస్ట్ – రూ. 0.76కోట్లు
గుంటూరు – రూ. 0.83 కోట్లు
కృష్ణా – రూ. 0.78 కోట్లు
నెల్లూరు – రూ. 0.55 కోట్లు
—————————–
ఏపీ+తెలంగాణ=11.11కోట్లు (18.80కోట్లు~ గ్రాస్)
—————————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 1.20 కోట్లు
ఓవర్సీస్ – 3.80 కోట్లు
—————————-
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్= 16.11కోట్లు (28.35కోట్లు~ గ్రాస్)
—————————-
కాగా, ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అవ్వాలంటే మొదటి నాలుగు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 14.89 కోట్ల షేర్‌ను వసూల్ చేయాల్సి అవసరం ఎంతైనా ఉంది.