Ante Sundaraniki: గత ఏడాది `శ్యామ్ సింగరాయ్`తో సూపర్ హిట్ ను అందుకున్న న్యాచురల్ స్టార్ నాని.. ఇప్పుడు `అంటే..సుందరానికీ!`తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అయ్యాడు. మలయాళ కుట్టి నజ్రియా నజీమ్ ఈ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ జూన్ 10న అంటే మరి కొన్ని గంటల్లోనే గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే చిత్ర టీమ్ నిర్వహించిన ప్రచార కార్యక్రమాలు సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేయగా.. నేటి సాయంత్రం జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ వస్తుండటంతో మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.
ఇకపోతే ఈ సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భానీగా జరిగినట్లు తెలుస్తోంది. నానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 30 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేసిందని అంటున్నారు. అంటే.. సుందరానికీ సాధించిన టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను ఓసారి గమనిస్తే..
తెలంగాణ (నైజాం )- రూ. 10 కోట్లు
రాయలసీమ (సీడెడ్) – రూ. 4 కోట్లు
ఆంధ్ర ప్రదేశ్ – రూ. 10 కోట్లు
—————————–
ఏపీ+తెలంగాణ= రూ. 24 కోట్లు
—————————–
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా- రూ. 2.50 కోట్లు
ఓవర్సీస్ – రూ. 3.50 కోట్లు
—————————-
వరల్డ్ వైడ్ కలెక్షన్= రూ. 30 కోట్లు
—————————-
కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో నాని మరో హిట్ ను ఖాతాలో వేసుకోవాలంటే.. రూ. 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…
KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…