Ante Sundaraniki: న్యాచురల్ స్టార్ నాని హీరోగా, మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా ట్యాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన తాజా చిత్రం `అంటే..సుందరానికీ!`. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ లో నరేష్, రోహిణి, నదియా, హర్ష వర్ధన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
జూన్ 10న విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో బ్రాహ్మణ యువకుడు సుందరంగా నాని, క్రిస్టియన్ యువతి లీలా థామస్ గా నజ్రియా నజీమ్ లు అదరగొట్టారు. అయితే ఓపెనింగ్స్ మాత్రం ఊహించిన స్థాయిలో రాలేదు. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.50 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ అందుకున్న ఈచిత్రం.. రెండో రోజు రూ. 3.3 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది.
అయితే మూడో రోజు సండే కలిసిరావడంతో.. నాని కాస్త పుంజుకుని రూ. 3.5 కోట్ల దాకా షేర్ ని వసూల్ చేశాడు. వరల్డ్ వైడ్ గా రూ. 4.35 కోట్ల రేంజ్ లో షేర్, రూ. 7.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాడు. ఇక ఏరియాల వారీగా `అంటే.. సుందరానికీ` మొదటి మూడు రోజుల టోటల్ కలెక్షన్స్‌ను ఓ సారి గమనిస్తే..
నైజాం – రూ. 4.54 కోట్లు
సీడెడ్ – రూ. 1.07 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.15 కోట్లు
ఈస్ట్ – రూ. 0.84 కోట్లు
వెస్ట్ – రూ. 0.73కోట్లు
గుంటూరు – రూ. 0.80 కోట్లు
కృష్ణా – రూ. 0.74 కోట్లు
నెల్లూరు – రూ. 0.53 కోట్లు
—————————–
ఏపీ+తెలంగాణ=10.40కోట్లు (17.60కోట్లు~ గ్రాస్)
—————————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 1.00 కోట్లు
ఓవర్సీస్ – 3.55 కోట్లు
—————————-
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్= 14.95కోట్లు (26.25కోట్లు~ గ్రాస్)
—————————-
కాగా, ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వాలంటే మొదటి మూడు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 16.05 కోట్ల షేర్‌ను వసూల్ చేయాల్సి ఉంటుంది.
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…