Anupama-Pawan Kalyan: అనుపమ పరమేశ్వరన్.. ఈ మలయాళ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరియాలు అవసరం లేదు. `ప్రేమమ్` అనే మలయాళ మూవీతో సినీ రంగప్రవేశం చేసిన అనుపమ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన `అ ఆ`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత `శతమానం భవతి`తో గుర్తింపు దక్కించుకున్న అనుపమ.. స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయినా నటిగా మంచి మార్కులే వేయించుకుంది.
ప్రస్తుతం ఈమె `బటర్ ఫ్లై` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఘంటా సతీష్ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్‌పై రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ నేపథ్యంలోనే సినిమాను ప్రమోట్ చేసేందుకు అనుపమ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే `పవన్‌కల్యాణ్‌తో సినిమా ఎప్పుడు చేస్తారు?` అని యాంకర్ ప్రశ్నించగా.. అందుకును అనుపమ షాకింగ్ కామెంట్స్ చేసింది. `పవన్‌కల్యాణ్ గారితో సినిమానా..? అసలు ఆయన గురించే మాట్లాడను, ఆ స్థాయికి నేనింకా ఎదగలేదు.
ఆయన చాలా పెద్ద స్టార్. ఆయన నటించిన సినిమాలు చూసి, వ్యక్తిత్వం గురించి తెలుసుకుని అభిమానిని అయిపోయా. ఆయన నటించిన భీమ్లానాయక్ సినిమాను బటర్‌ఫ్లై హీరో నిహాల్తో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో సుదర్శన్ థియేటర్లో బురఖా వేసుకుని చూసొచ్చా. అది ఎప్పటికీ మరచిపోలేను` అంటూ అనుపమ చెప్పుకొచ్చింది. దాంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి.