అనుపమ పరమేశ్వరన్.. ఈ అందాల భామ గురించి పరిచయాలు అవసరం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిన `అ ఆ` మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనుపమ.. తక్కువ సమయంలో అందం, అభినయం, ఆకట్టుకునే నటనతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.
రీసెంట్ ఈ బ్యూటీ `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించింది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఆగస్టు 13న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. అయితే అనూహ్యంగా విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టించింది.
ప్రస్తుతం సక్సెస్ జ్యోష్‌లో ఉన్న అనుపమకు ఇటు టాలీవుడ్లోనే కాదు అటు బాలీవుడ్ నుంచి సైతం ఆఫర్లు వస్తున్నాయి. ఇలాంటి తరునంలో ఈ బ్యూటీ ఓ సీనియర్ హీరో సరసన నటించేందుకు ఓకే చెప్పిందట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు మాస్ మహారాజ్ రవితేజ. ఈయన ఇటీవల ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేనితో ఓ సినిమాకు సైన్ చేశాడు.
ప్రీ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అయితే ఈ చిత్రంలో రవితేజకు జోడీగా అనుపమ కనిపించబోతోందట. కార్తికేయ-2 చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా కార్తిక్ ఘట్టమనేనినే వర్క్ చేశారు. ఈ క్రమంలోనే అనుపమతో ఉన్న సాన్నిహిత్యంతో కథను నెరేట్ చేయగా.. ఆమె వెంటనే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రవితజ వంటి సీనియర్ హీరో, పైగా వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు.. అలాంటి హీరోకు అనుపమ ఓకే చెప్పిందా అంటూ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.